తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్‌పై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తూండటంతో వారికి కౌంటర్ ఇస్తే మరింత రెచ్చిపోతున్నారని నేరుగా మోదీని టార్గెట్ చేశారు. ఆయనను బట్టేబాజ్, లుచ్చాగాడు అనగలమని కానీ అనుమని వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఈ వ్యాఖ్య్యలు బీజేపీలో కూడా సహజంగానే చర్చనీయాంశమయ్యారు. దేశంలో మోదీని ఇంత వరకూ కీలక స్థానంలో ఉన్న వాళ్లు అలా తిట్టి ఉండరని బీజేపీ నేతలు ఫీలవుతున్నారు.
మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని నిర్ధారణకు వచ్చిన బీజేపీ నేతలు కేటీఆర్‌పై విరుచుకుపడుతున్నారు. గతంలో లేని విధంగా తీవ్ర పదజాలం ప్రయోగిస్తున్నారు. కానీ వారి మాటలేవీ పెద్దగా హైలెట్ కావడం లేదు. మోదీ స్థాయి అన్న నేతను అనడం వేు.. కేటీఆర్‌ను ఘాటుగా తిట్టడం వేరు. మోదీని అన్న మాటలే విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నాయి. దీంతో బీజేపీ నేతలు ఇస్తున్న కౌంటర్ సరిగ్గా లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
కేటీఆర్ తన మాటల్ని మరింత పదునుగా మార్చి విమర్శలు గుప్పిస్తున్నారు. గాడ్సే అభిమాని మోదీ అని అంటున్నారు. చిట్ చాట్లోనూ అదే చెబుతున్నారు. బీజేపీ నేతలు కేసీఆర్‌ను టార్గెట్ చేసుకుంటే… కేటీఆర్ మాత్రం నేరుగా మోదీని టార్గెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మోదీ గౌరవడాన్ని కాపాడాల్సిన పరిస్థితి బీజేపీ నేతలపై పడింది.. ఎక్కడ తాము గీత దాటితే ఇంకా ఎక్కడ మోదీపై విరుచుకుపడుతారోనన్న భయం బీజేపీ నేతల్లో ఉంది. అందుకే పద్దతిగానే విమర్శలు చేస్తున్నారు. ఇది … సరిగ్గా కౌంటర్ ఇవ్వలేకపోతున్నారన్న అభిప్రాయాన్ని కల్పిస్తోంది.