బీజేపీకి కొరకరాని కొయ్యగా మారిన ధృవ్ రాథీని నిలువరించేందుకు బీజేపీ బిగ్ స్కెచ్ వేసింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని ఎలా చిన్నాభిన్నం చేస్తున్నాయో వివరిస్తూ ధృవ్ రాథీ చేస్తోన్న వీడియోస్ కు మంచి ఆదరణ లభిస్తోంది. వ్యూస్ అన్నీ మిలియన్స్ లో ఉంటున్నాయి. దీంతో ధృవ్ రాథీని ఇకనైనా నిలువరించకపోతే బీజేపీకి తీవ్ర నష్టం వాటిల్లుతుందని బీజేపీ ఆందోళన చెందుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఈ క్రమంలోనే తెలంగాణలో బీజేపీ మద్దతుదారులు ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో ధృవ్ రాథీ నోరు మూయించేందుకు ఏం చేయలని ఓ వ్యక్తి వేదిక మీదనున్న వారిని ప్రశ్నించాడు. మనమందరం కలిసి అతని వీడియోస్ ను ఆపాలి. యూ ట్యూబ్ లో లేకుండా చేయాలి ఇందుకోసం మనం ఏం చేయోచ్చునని అడగగా… అందుకు మరో వ్యక్తి బదులిచ్చాడు.
ధృవ్ రాథీ చేస్తోన్న వీడియోస్ యూట్యూబ్ గైడ్ లైన్స్ ను అనుసరించే ఉన్నాయి. రాజకీయంగానే కాకుండా రాజ్యాంగబద్దంగా సరైన విధంగా వ్యవహరిస్తున్నాడని అందువలన అతని అడ్డుకోవడం కష్టమని, కాకపోతే అతని టార్గెట్ చేయడం కంటే అతని వాదనకు ఎలా కౌంటర్ ఇస్తామనే విషయంపై ఫోకస్ పెట్టాలని సూచించారు.
ఆ తర్వాత మరో వ్యక్తి మాట్లడుతూ… ధృవ్ రాథీని అడ్డుకోవాలంటే ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో అతనిని కమెడియన్ గా చేయాలన్నారు. ఎలాగంటే వచ్చే కేబినెట్ లో సన్నీ లియోన్ ను మోడీ మంత్రిని చేస్తారని ధృవ్ రాథీ మాట్లాడినట్లుగా ప్రచారం చేయాలని చెప్పారు. ఇలా ధృవ్ రాథీ అనని మాటలు అన్నట్లుగా కంటిన్యూగా పెట్టాలని అప్పుడే అతను ప్రజల్లో జోకర్ గా మారుతాడని కామెంట్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
https://x.com/zoo_bear/status/1793154101913727063