తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను కనీవినీ ఎరగని రీతిలో నిర్వహించేలా ప్లాన్ చేస్తోంది అధికార కాంగ్రెస్. పైకి తెలంగాణ ఖ్యాతిని చాటేందుకు అని చెబుతున్నా కాంగ్రెస్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని చాటడమే ఆ పార్టీ నేతల హిడెన్ ఎజెండా. సోనియా గాంధీ లేకుంటే అసలు రాష్ట్రమే వచ్చేది కాదని చెప్పడం కాంగ్రెస్ చేపడుతోన్న ఈ దశాబ్ది ఉత్సవాల అసలు సీక్రెట్.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర క్రెడిట్ కేసీఆర్ దేనని చెబుతూ వస్తోన్న బీఆర్ఎస్… కాంగ్రెస్ ప్లాన్స్ తో వ్యూహం మార్చేసింది. బీఆర్ఎస్ అధ్వర్యంలో కూడా దశాబ్ది ఉత్సవాలను రాష్ట్రమంతటా మూడు రోజులపాటు గ్రాండ్ గా నిర్వహించాలని పిలుపునిచ్చింది. తెలంగాణ రాష్ట్ర క్రెడిట్ కేసీఆర్ ఖాతా నుంచి చేజారిపోనివద్దనేది బీఆర్ఎస్ అసలు టార్గెట్. ఈ ఉత్సవాల్లో కేసీఆర్ కృషిని చాటాలనేది ఆ పార్టీ ముఖ్య ఉద్దేశం.
అయితే, ఈ దశాబ్ది ఉత్సవాలను బీఆర్ఎస్ – కాంగ్రెస్ పోటాపోటీగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తుంటే బీజేపీ మాత్రం కిమ్మకపోవడం చర్చనీయాంశం అవుతోంది. గతంలో రాష్ట్ర ఏర్పాటులో తమ కృషి కూడా ఉందని, పార్లమెంట్ లో తాము తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వడం వల్లే అరవై ఏళ్ల ఆకాంక్ష సాకరమైనదని చెప్పుకున్న బీజేపీ … తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై హడావిడి చేయకపోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.