సంక్రాంతి బరిలో ఐదు తెలుగు సినిమాలు దిగుతున్నాయి. సాధారణంగా అయితే ఈ సీజన్ కి ఓ రెండు పెద్ద సినిమాలు రావడం కామన్. కానీ ఈసారి పెద్దా చిన్నా మీడియం కలుపుకొని ఐదు సినిమాలు వరుసకట్టాయి. దీంతో సహజంగానే థియేటర్స్ సమస్య తలెత్తుతోంది. ప్రస్తుతం ఈ విషయంలో నిర్మాతల్లో చర్చలు జరుగుతున్నాయి.
సంక్రాంతి సినిమాల్లో ‘హనుమాన్’ స్టార్ ఎట్రాక్షన్ పరంగా చిన్న సినిమా. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో తేజ సజ్జా హీరో. ఇటివలే ట్రైలర్ ని కూడా వదిలేశారు. అయితే సంక్రాంతి బరి నుంచి ఈ సినిమాని తప్పించాలనే వాదన మిగతా నిర్మాతలు వినిపిస్తున్నారని తెలుస్తోంది. అయితే హనుమాన్ నిర్మాత మాత్రం వెనక్కి తగ్గమని క్లియర్ గా చెబుతున్నారు.
ఈ నేపధ్యంలో కొందరు ఆయనకి ఫోన్ చేసి వాయిదా వేయకపోతే తీవ్ర పరిణామాలు ఎదురుకోవాల్సి ఉంటుందని, థియేటర్స్ దొరక్కుండా చేస్తామని బ్లాక్ మైల్ కాల్స్ చేస్తున్నారని తెలిసింది. అయితే ఎన్ని బెదిరింపులకు పాల్పడిన హనుమాన్ ని సంక్రాంతి తీసుకురావడానికి నిర్మాత పట్టుదలతో వున్నారు. మొత్తానికి సంక్రాంతి సినిమా విడుదలపై నిర్మాతల్లో గట్టి చర్చలే జరుగుతున్నాయి. ఇప్పటివరకూ జరిగిన చర్చలు పరిశీలిస్తే.. డ్రాప్ అవ్వడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు.