బెంగాల్ టైగర్ తరవాత ఎవరితో సినిమా చేయాలి, ఎలాంటి కథ ఎంచుకోవాలి? అనే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నాడు రవితేజ. ఇద్దరు ముగ్గురు దర్శకుల కథలకు ఓకే చెప్పి కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాడు. ఎట్టకేలకు బాబి కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘పవర్’ సినిమాతో టాలీవుడ్లో దర్శకుడిగా అడుగుపెట్టాడు బాబి. మాస్ యాక్షన్ అంశాలు కలగలిపిన ఆ చిత్రం బాక్సాఫీసు దగ్గర మంచి ఫలితాన్నే సాధించింది. ఆ తరవాత బాబి.. పవన్ కల్యాణ్‌తో ‘సర్దార్ – గబ్బర్‌సింగ్’ తీశాడు. అదిడిజాస్టర్ లిస్టులో చేరిపోయింది. అదే సమయంలో రవితేజ బాబిని పిలిచి ఆపన్న హస్తం అందించాడు. ‘నీతో సినిమా చేస్తా.. కథ సిద్ధం చేసుకో’ అని ఆఫర్ ఇచ్చాడు. ఇప్పుడు బాబి రవితేజ కోసం ఓ స్టోరీ రెడీ చేశాడు. దానికి రవితేజ కూడా గ్నీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వచ్చే నెలలో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. పవర్‌తో హిట్టు కొట్టిన ఈ ద్వయం.. ఈసారి ఎలాంటి ఫలితాన్ని అందుకొంటారో చూడాలి. చుట్టాలబ్బాయ్ నిర్మించిన రామ్ తాళ్లూరి ఈ చిత్రానికి నిర్మాత అని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.