వైసీపీలో గ్రంథసాంగులు ఎక్కువ మంది ఉన్నారు. అధికారం ఉన్నప్పుడు బయటపడలేదు కానీ.. ఇప్పుడు మాత్రం అందరూ కథలు కథలుగా చెప్పుకునేలా వెబ్ సిరీస్లకు సరిపోయేలా మసాలలతో బయటకు వస్తున్నారు. విజయసాయిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ తర్వాత.. తాజాగా ద్వారంపూడి వ్యవహారం వెలుగులోకి వచ్చేలా కనిపిస్తోంది.
జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ తాజాగా ద్వారంపూడి ఇల్లీగర్ ఎఫైర్లపై కీలక విషయాలు బయట పెట్టారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక దళిత మహిళతో అక్రమ సంబంధంలో ఉన్నారని ఆయన చెబుతున్నారు. ఆమె గర్భవతి అయిన ఆమెకు మగ లేదా ఆడ బిడ్డ అని తెలుసుకోడానికి స్కానింగ్ కూడా చేయించారని.. అంటున్నారు. ఆ పుట్టిన బిడ్డకు తలనీలాలు తిరుపతిలో ఒళ్ళో కూర్చోబెట్టుకొని ద్వారంపూడి చేయించడం లాంటి ఆరోపణలు బోలిశెట్టి చేస్తున్నారు.
గత సంవత్సరం నుండి ఆమెను బెదిరిపంులకు గురి చేస్తున్నారని ఆమెను హౌస్ అరెస్ట్ చేసినట్లుగా చెబుతున్నారు. ఇంటి బయట 28 కెమెరాలను పెట్టి ఆమెను ఇంట్లోంచి బయటికి రానివ్వకుండా గృహ నిర్భంధం చేయడం.. అలాగే కార్ లోనే డివైస్ లు పెట్టి మహిళ ఎక్కడికి వెళ్తుందో ట్రాక్ చేయడం చేస్తున్నారని బోలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు చేశారు. ఈ అంశంపై మీడియా గుట్టు బయటకు లాగితే.. ఓ వారం, పది రోజుల పాటు చానళ్లకు పండగే పండగ అవుతుంది. ద్వారంపూడి క్యారెక్టర్ కూడా బయటకు వస్తుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.