అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు.
ఆగంతకుల బెదిరింపులతో జైలు పరిసరాలలో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు కొనసాగుతున్నాయి. అయితే, ఇదే జైలులో ఎమ్మెల్సి కవిత సహా పలువురు ఖైదీలుగా ఉన్నారు. జైలును బాంబుతో పేల్చేస్తామని బెదిరింపులు రావడంతో కవిత అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు.
ఇక, లిక్కర్ స్కామ్ లో కవితకు మరోసారి నిరాశే ఎదురైంది. నేటితో ఆమె జ్యుడిషియల్ కస్టడీ ముగిసినప్పటికీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి కస్టడీని పొడిగించింది. మరో 14రోజులపాటు కవితకు కస్టడీ పొడిగించాలని ఈడీ కోరగా..మే 20 వ తేదీ వరకు కస్టడీని పొడగిస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది.