తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. దాదాపుగా ప్రతీ వారం ఓ భారీ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిచూపుతూ ప్రకటన చేస్తోంది. తాజాగా జర్మన్ మల్టినేషనల్ దిగ్గజం బాష్ హైదరాబాద్‌లో తమ సాఫ్ట్ వేర్ యూనిట్ పెట్టాలని నిర్ణయించుకుంది. బాష్ గ్లోబల్ సాఫ్ట్ వేర్ టెక్నాలజీస్ , ఆర్ అండ్ డీ విభాగాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కేటీఆర్‌తో వర్చువల్‌గా ఆ కంపెనీ యాజమాన్యం చర్చలు జరిపి అంగీకారం తెలిపింది.
ఈ విషయాన్ని కేటీఆర్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. బాష్ కంపెనీ హైదరాబాద్‌లో క్యాంపస్ ఏర్పాటు చేయడం వల్ల మూడు వేల ఉద్యోగాలు లభించనున్నాయి. హైదరాబాద్ ఇప్పటికే అనేక ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీలతో ఐటీ నగరంగా రేపు పొందింది. ఇప్పుడు బాష్ కూడా అతి పెద్ద క్యాంపస్ ఏర్పాటుకు ముందుకు రావడం అంతర్జాతీయంగా హైదరాబాద్‌కు మరింత మంచి పేరు రానుంది.
అతి త్వరలోనే మైక్రోసాఫ్ట్‌కు సంబంధించి డేటా సెంటర్ ఏర్పాటుపై ప్రకటన వచ్చే అవకాశం ఉంది.ఆ తర్వాత హైదరాబాద్ దేశంలోనే అగ్ర స్థాయి ఐటీ నగరాల్లోఒకటిగా పేరు పొందే అవకాశం ఉంది. రాజకీయాలు ఎలాఉన్నా.. కేటీఆర్ హైదరాబాద్‌కు పెట్టుబడుల ఆకర్షణ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడటం లేదు.