రాజకీయ ప్రకటనలు అంటే, ఆడంబరాలకు అర్థంలా వుంటాయి. మహా అయితే సినిమా నటులో, మరొకరో చేసే పటాటోపం కనిపిస్తుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఆరంభం నుంచి తమ పార్టీ కోసం, ప్రచారం కోసం చేసే పాటలు, ప్రకటనల విషయంలో చాలా కేర్ తీసుకుంటూ వస్తోంది. ఎన్టీఆర్ అప్పట్లో చేయించిన పాటలు కానీ, తరువాత తరువాత ప్రతి ఎన్నికల సమయంలో చేస్తున్న ప్రకటనలు కూడా చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. అయితే అవన్నీ ఒక ఎత్తు. ఈసారి ఎన్నికలకు దర్శకుడు బోయపాటి చేసిన ప్రకటనలు మరొక ఎత్తు.
ఈసారి బోయపాటి చేసిన ప్రకటనలు అన్నీ ఓ రేంజ్ లో వున్నాయి. రెండు మూడు నిమషాల ప్రకటనలు అన్నీ భారీ సినిమాల టీజర్ల మాదిరిగా వున్నాయి. వాటిల్లోనే డైలాగులు, వాటిల్లోనే ఎమోషన్లు, వాటిల్లోనే రిచ్ నెస్, ఇలా అన్నీ విధాలా ఎక్స్ ట్రీమ్ అన్నట్లు తయారుచేసారు.
ఇకపోతే ఇన్నీ ఒక ఎత్తు లేటెస్ట్ గా తయారు చేసి రెండున్నర నిమషాల పాట ఒక ఎత్తు. బోయపాటి చేయించిన ఈ లిరికల్ వీడియో ఇంకా బయటకు పూర్తిగా రాలేదు. ఈ లిరికల్ వీడియో ఓ భారీ సినిమాలో పాట స్థాయిలో వుంటుంది. పాటలో సాహిత్యం కూడా ఉన్నతంగా వుంది. ప్రచారం కోసం కావచ్చు, కమర్షియల్ గా కావచ్చు. కానీ ఓక సృజన కారుడు అత్యున్నత ప్రతిభ లేదా ప్రశంసాపాత్రమైన ప్రతిభ కనబర్చినపుడు శభాష్ అని తీరాల్సిందే. అందుకే శభాష్ బోయపాటి.
ఆ పాట రచన ఇలా సాగింది.
…
శిల మోసే గాయాలే కావా శిల్పాలు
నీ సహనం చూస్తుంటే ఉలికి అయినా కన్నీళ్లు
శిధిలాల సదనాలై సాగిన దారుల్లో
నిలువెల్లా బలిచేసే కుంట్రల కేంద్రాలు
నిన్ను చీల్చినా నీ వెన్ను వణుకదు
నువ్వు ఉండగా ఈ మన్ను తొణకదు
చంద్రన్నా..చంద్రన్నా
నువ్వు చెమ్మగిల్లనీయవు ఏ కళ్లయినా
నివు కమ్ముకున్న కష్టాల పాలయినా……
శిల మోసే గాయాలే కావా శిల్పాలు
నీ సహనం చూస్తుంటే ఉలికి అయినా కన్నీళ్లు
రాజ్య కాంక్షతో
రాష్ట్ర ద్రోహులు
హద్దు మీరుతూ..సరిహద్దుల దొరలు
ఏకమై చేస్తుంటే ముప్పేట దాడులు
అయిదుకోట్ల జన రక్షణ మీ ప్రాణాలు
చంద్రన్నా..చంద్రన్నా
నువ్వు చెమ్మగిల్లనీయవు ఏ కళ్లయినా
నివు కమ్ముకున్న కష్టాల పాలయినా……
చంద్రన్నా..చంద్రన్నా..
ఆంధ్ర జాతికి కవచమే నీవన్నా
మిన్నుదాటి నిలిచిన ఘన చరితే నీదన్నా..
శిల మోసే గాయాలే కావా శిల్పాలు
నీ సహనం చూస్తుంటే ఉలికి అయినా కన్నీళ్లు