తెలంగాణలో బలమైన క్యాడర్ ను కలిగిన బీఆర్ఎస్ ను ఎవరూ పట్టించుకోవడం లేదు. ఆ పార్టీకి వరుస షాకులు తగులుతున్నా జనాల నుంచి సానుభూతి అసలే మాత్రం లభించడం లేదు. పదేళ్లు అధికారంలో కొనసాగిన పార్టీ ఈ దుస్థితికి చేరడం ఊహించని పరిణామమే. బీఆర్ఎస్ కు కనీసం నైతిక మద్దతు లభించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయి ఐదు నెలలు కావొస్తుంది.. ఆమె బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నా ఫలించడం లేదు.. ఇటీవల ఆమె అస్వస్థతకు గురైనా.. పాపం అన్నవాళ్లు లేరు.. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్యేలు కేటీఆర్ , హరీష్ రావులను పోలీసులకు అదుపులోకి తీసుకున్నా ఖండించినవాళ్లూ లేరు..బీఆర్ఎస్ నేతలు తప్ప ఎవరూ బయట నుంచి సానుభూతి చూపలేదు. ఇక, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తుంటి విరిగినప్పుడు కూడా సింపతి కనిపించలేదు.
Also Read: బీఆర్ఎస్ ఆఫీసును నేలమట్టం చేయండి.. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలు
సెంటిమెంట్ రాజకీయాల్లో తనదైన రాజకీయం చేసే బీఆర్ఎస్ .. ఇప్పుడు అదే సానుభూతిని ప్రజల నుంచి కోరుకుంటుంది. కానీ, ప్రజలు మాత్రం తమకేం సంబంధం అన్నట్లుగానే ఉంటున్నారు తప్పితే బీఆర్ఎస్ కు మద్దతునివ్వడం లేదు. దీంతో బీఆర్ఎస్ అధిష్టానం కూడా తీవ్ర నైరాశ్యంలోకి వెళ్తుంది. ప్రజలు బీఆర్ఎస్ పై ఆగ్రహంగా ఉన్నారని..కొంతకాలం ఓపిక పడితే తప్ప తమకు ప్రజల నుంచి సానుకూలత లభించదని కొంతమంది బీఆర్ఎస్ నేతల అభిప్రాయంగా వినిపిస్తోంది.