ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సినిమాను మించిన ట్విస్టులు నమోదు అవుతున్నాయి. నిఘా పరికరాల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి అవసరం. అలా చేస్తే దిగుమతి చేసుకుంటున్న పరికారాలకు ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. దాంతో ఏయే పరికారాలు తెప్పించామో అనేది సులభంగా తెలిసిపోయే అవకాశం ఉండటంతో బీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్సీ రవిపాల్ అనే టెక్నికల్ కన్సల్టెంట్ ను రంగంలోకి తెచ్చారు.
కేంద్ర ప్రభుత్వం అనుమతి లేకుండా ఇజ్రాయెల్ నుంచి ప్రత్యేకమైన పరికారాలను రవిపాల్ ద్వారా తెప్పించారు.
ఎస్ఐబి కన్సల్టెంట్ రవిపాల్ పని చేశారు. ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక పరికరాన్ని దిగుమతి చేసుకోవడంలో ఆయన సహకరించారని దర్యాప్తులో వెల్లడయినట్లుగా తెలుస్తోంది. ఎమ్మెల్లీ తన పలుకుబడి ఉపయోగించి రవిపాల్ తో ట్యాపింగ్ డివైస్లను తెప్పించినట్లు సిట్ అధికారులు గుర్తించడంతో సదరు ఎంఎల్సిని విచారించేందుకు సిట్ అధికారులు సిద్ధం అవుతున్నారు.
పెద్ద మొత్తంలో నిఘా పరికరాలను అనధికారికంగా తెప్పించేందుకు రవిపాల్ ఓ సాఫ్ట్ వేర్ కంపెనీని ఉపయోగించుకున్నారు. ఆ కంపెనీ పేరుతో పేరుతో ఇజ్రాయెల్ పరికరాలను తెప్పించి వాటిని సదరు ఎంఎల్సికి అప్పగించగా ఆయన వాటిని మరో ప్రైవేట్ వ్యక్తికి అప్పగించడంతో ఆ మేరకు ఫోన్ ట్యాపింగ్ లు జరిగినట్లు చెబుతుననారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో సదరు ఎంఎల్సి ఎవరు అంటే.. .బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. రాజకీయంగా అంత యాక్టివ్ గా ఉండరు కానీ.. తెర వెనుక వ్యవహారాలు మాత్రం చక్కబెడతారని.. ఇప్పుడు నిండా ఇరుక్కుపోయినట్లేనని బీఆర్ఎస్లో గుసగుసలు ప్రారంభమయ్యాయి.