కాంగ్రెస్ టార్గెట్ గా ఇటీవల బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎదురుదాడి మరింత ఎక్కువైంది. అధికార పార్టీ సోషల్ మీడియా బలహీనపడగా.. బీఆర్ఎస్ సోషల్ మీడియా సీఎం టార్గెట్ గా విరుచుకుపడుతోంది. ఇందుకోసం బీఆర్ఎస్ ప్రత్యేకంగా టీమ్ ను నడుపుతోన్న సంగతి తెలిసిందే. సోషల్ మీడియా పవర్ ఏంటో ఆలస్యంగా తెలుసుకున్న కేటీఆర్.. ఇటీవల సోషల్ మీడియా టీమ్ తో ప్రత్యేకంగా భేటీ అయి డైరక్షన్స్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.
కేటీఆర్ డైరక్షన్ లోనే భాగంగానే ఇటీవల రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనపై బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్ విమర్శలు చేసినట్లుగా టాక్ నడుస్తోంది. ఇందులో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీపై నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. రేవంత్ ను ఇరుకున పెట్టేందుకే ఆయన సోదరుడి ఇటీవల ఫారిన్ టూర్ ను ట్రోల్ చేశారని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. రేవంత్ అన్న తిరుపతి రెడ్డి జన్మదిన వేడుకలను కూడా అదే పనిగా బీఆర్ఎస్ ట్రోల్ చేసింది.
ఇక, పెట్టుబడుల కోసం అమెరికా వెళ్ళిన రేవంత్.. స్వచ్చ బయో కంపెనీతో ఎంఓయూ కుదుర్చుకోవడం తన సోదరుడు జగదీశ్ రెడ్డికి ప్రయోజనం చేకూర్చేందుకునేని బీఆర్ఎస్ సోషల్ మీడియా మూకుమ్మడిగా రేవంత్ ఫ్యామిలీపై నెగిటివ్ ప్రచారం విస్తృతంగా కొనసాగించింది. ఇలా రేవంత్ సర్కార్ పై నెగిటివ్ ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించిందని..ఏటా 15కోట్లు ఖర్చు చేయడానికి సిద్దంగా ఉండగా, అవసరమైతే ఈ బడ్జెట్ పెంచేందుకు సిద్దంగా ఉన్నట్లు సోషల్ మీడియాకు సంకేతాలు ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.