తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఏ రకంగానూ ఎదుర్కోలేకపోతోంది. ఆయన కౌంటర్లకు బెదిరిపోతోంది. అందుకే అసెంబ్లీలో వివిధ శాఖలు, అంశాలపై చర్చ జరుగుతుంటే వాటిపై మాట్లాడకుండా రేవంత్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తోంది. పదేపదే గత విషయాలను ప్రస్తావిస్తూ.. అదే పోరాటం అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు.
అసెంబ్లీలో రేవంత్ ను ఎదుర్కోవడంలో విఫలమై..బయట ట్వీట్లతో విమర్శలు చేస్తూ స్వయం సంతృప్తి పొందుతున్నారు. అనవసర విమర్శలు చేస్తూ..రేవంత్ కౌంటర్లను ఏమాత్రం తట్టుకోలేకపోతున్నారు. దీనిని భరించలేక రేవంత్ …మమ్మల్ని విమర్షిస్తున్నావా..పదవులను గడ్డిపోచలుగా త్యాగం చేసిన వాళ్లం అంటూ హరీష్ రావు పేర్కొన్నారు. కేటీఆర్ తరహాలోనే హరీష్ కూడా ట్వీట్ లతో రేవంత్ పై ఎదురుదాడికి ప్రయత్నించడం చర్చనీయాంశం అవుతోంది. అసెంబ్లీలో రేవంత్ ను నేరుగా ఎదుర్కొలేకే ఇద్దరూ ఈ విధమైన పంథాను ఫాలో అవుతున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Also Read : రేవంత్ చెప్పకనే చెప్పారు… విలీనానికి బ్రేకులు లేనట్లే?
రేవంత్ ప్రశ్నలపై హరీష్, కేటీఆర్ లు నేరుగా సమాధానం ఇవ్వకుండా ప్రతిసారి గత విషయాలను లేవనేతుతున్నారు. చంద్రబాబు శిష్యుడు అని , తెలంగాణ వ్యతిరేకి అని విమర్శలు చేస్తున్నారు తప్పితే…సబ్జెక్ట్ తో సరైన కౌంటర్ విసరడం లేదన్న ఆభిప్రాయం వినిపిస్తోంది. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అవుతున్నా ఇంకా సెంటిమెంట్ ను వెలికితీసి రేవంత్ ను దెబ్బతీయాలని భావిస్తున్నారు.. కానీ ఆ ప్రయత్నాలేవీ ఇప్పుడు నిలబడవు. అంశాల వారీగా రేవంత్ ను ఇరుకున పెడితే తప్ప రేవంత్ ను దోషిగా చూపలేం. అసలు విషయం ఇలా ఉంటే.. బీఆర్ఎస్ మాత్రం గతం..గతం అంటూ రేవంత్ ను విమర్శిస్తుండటంతో అవన్నీ తేలిపోతున్నాయి. బీఆర్ఎస్ బలహీనతకు ఇవి సూచికగా కనిపిస్తున్నాయి.