అవును. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ కోసం బీఆర్ఎస్ వెయిట్ చేస్తోంది. విభజన సమస్యల పరిష్కారం కోసం చంద్రబాబు – రేవంత్ రెడ్డిలు ఈ నెల 6న సమావేశం కానుండటంతో తమకు కావాల్సినంత స్టఫ్ దొరుకుతుందని ఆశగా ఎదురుచూస్తోంది. ఈ భేటీనే ప్రస్తుత కల్లోల పరిస్థితిని నుంచి బీఆర్ఎస్ ను కొంచెం బయటపడేస్తుందని ఆశలు పెట్టుకుంది.
జగన్ తో కేసీఆర్ కు మంచి సాన్నిహిత్యం ఉన్నప్పటికీ గత ఐదేళ్లలో విభజన సమస్యల పరిష్కారం కోసం ఒక్క ముందడుగు పడింది లేదు. కనీసం ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేయలేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారడంతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విభజన సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుంటున్నారు.
ముఖ్యమంత్రుల భేటీ తర్వాత విభజన సమస్యలపై ఎలాంటి రిజల్ట్ ఉంటుందో కానీ, ఈ సమావేశం కోసం మాత్రం బీఆర్ఎస్ తెగ వెయిట్ చేస్తోంది. తెలంగాణ సెంటిమెంట్ తోనే రాజకీయం పండించే బీఆర్ఎస్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును నిర్ద్వందంగా వ్యతిరేకిస్తుంది. అసలే అధికారం కోల్పోయి సెంటిమెంట్ ను పండించే అవకాశం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తోన్న బీఆర్ఎస్ .. చంద్రబాబుతో రేవంత్ భేటీని రాజకీయంగా ఉపయోగించుకోవాలని అనుకుంటుంది.
ముఖ్యంగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఈ భేటీ కోసం కాచుకూర్చుంది. ఈ సమావేశం ద్వారా తమకు కావలసినంత స్టఫ్ దొరుకుతుందని వెయిట్ చేస్తోంది. అయితే, సోషల్ మీడియాలో వ్యతిరేక, కల్పిత ప్రచారం చేస్తే తాట తీస్తానని హెచ్చరించిన రేవంత్ పట్ల బీఆర్ఎస్ అలాంటి స్టాండ్ తీసుకుంటుందా..? అనేది చూడాలి.