మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. 108 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్ కుమార్ రెడ్డి గెలిచారు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కసిరెడ్డి నారాయణరెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరి కల్వకుర్తి నుంచి పోటీ చేసి గెలిచారు. సిట్టింగ్ సీటుకు రాజీనామా చేశారు. దాంతో ఉపఎన్నిక వచ్చింది.
మహబూబ్నగర్ జిల్లాలో మొత్తం 1,394 మంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు ఓటర్లుగా ఉండగా, వీరిలో బీఆర్ఎస్కు 823, కాంగ్రెస్కు 396, బీజేపీకి 88, బీఎస్పీకి ఒకటి, సీపీఐకి 4, సీపీఐ(ఎం)కు ఇద్దరు, ఎంఐఎంకు ఆరుగురు ఓటర్లు ఉన్నారు. ఈ లెక్క ప్రకారం చూస్తే బీఆర్ఎస్ కు విజయం నల్లేరుపై నడకే. కానీ 108 ఓట్ల ఆధిక్యత మాత్రమే వచ్చింది. కనీసం నాలుగు వందల మంది క్రాస్ ఓటింగ్ చేశారు.
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో గెలవడానికి బీఆర్ఎస్ గోవాలో క్యాంపులు ఏర్పాటు చేసింది. జడ్పీటీసీలు, ఎంపీటీసీల్లో 70 శాతం మంది బీఆర్ఎస్కు చెందిన వారే. అయినా అధికారం పోవడంతో ఓట్లు వేస్తారో లేదో తెలియని పరిస్థితి. అందుకే ముం కేటీఆర్ గోవాకు తీసుకెళ్లి నేరుగా ఓటింగ్ కు తీసుకొచ్చి ఓట్లేయించారు. దీంతో రేవంత్ ప్రయత్నాలు విఫలమయ్యాయి.