మద్య నిషేదం సంగతేమయిందని అడిగితే సొల్లు చెప్పడం అలవాటు చేసుకున్న వైసీపీ నేతలు ఇప్పుడు విచిత్రమైన లాజిక్కులు చెప్పడం ప్రారంభిచారు. హోదా ఏమయిందంటే.. ఇంకా సజీవంగా ఉంచాని కుబర్లు చెబుతూంటారు. హోదాని సజీవంగా ఉంచటమేందయ్యా… అంటే నాణ్యమైన పోరాటం చేస్తున్నామంటారు. ఈ నాణ్యమైన పోరాటల సంగతేమిటో ఎవరికీ అర్థం కాదు. ప్రతీ చోటా… నాణ్యాన్ని తీసుకొస్తూ ఉంటారు. మద్యంలో అంత నాణ్యత తేవడం సాధ్యం కాదని అనుకున్నారేమో కానీ.. బాధ్యతాయుత అనే భావన తెస్తున్నారు. మద్యనిషేధం చేయడంలేదు కానీ.. బాధ్యతాయుత మధ్యపానం తమ బాధ్యత అని చెప్పుకొస్తున్నారు.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో పద్దెనిమిది వేల కోట్లకుపైగా మద్యం నుంచి ఆదాయం వస్తుందని బడ్జెట్ లో చెప్పారు. ప్రజల నుంచి ఇంత పెద్ద మొత్తం ఎలా పిండుకుంటారని .. ప్రశ్నిస్తే.. రేట్లు పెంచి… తాగే వారిని తగ్గించి… బాధ్యాతాయుత మద్యపానాన్ని అలవాటు చేస్తున్నారు. చెప్పేవాడికి వినేవాడు లోకువ అంటే… వైసీపీ మంత్రులను చూస్తే అర్థమైపోతుది. ఆరోగ్యానికి హానికరమైన చీప్ లిక్కర్ ను అమ్ముతూ పేదల రక్తాల్ని పిండుకున్నట్లుగా పిండుకుంటూ.. బాధ్యతాయుత మద్యపానం అంటూ కబుర్లు చెప్పడం బుగ్గన లాంటి మంత్రులకే చెల్లింది.
ప్రతీ ఏటా పెరగాల్సిన ఆదాయం పెరగడం లేదు. ఒకప్పుడు నాలుగైదు వేల కోట్లు ఉండే మద్యం ఆదాయం ఇప్పుడు ఇరవై వేల కోట్లకు చేరింది. అయినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంది. ఇతర రంగాల్లో పడిపోవడమే దీనికి కారణం. పరిస్థితి ఇంత స్పష్టంగా కనిపిస్తున్నా… బుగ్గన మాత్రం పిట్టకథలు చెబుతున్నారు. అన్నీ తెలిసి కూడా రాష్ట్ర పతనంలో భాగమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.