బైరెడ్డి సిద్ధార్థరెడ్డి .. సోషల్ మీడియా టీముల్ని పెట్టుకుని .. తన ఇమేజ్‌కు గాలి కొట్టించుకున్న లీడర్. నందికొట్కూరులో తానే పెద్ద ఫ్యాక్షన్ లిడర్‌ని అన్నట్లుగా బిల్డప్ ఇచ్చారు. కానీ అది అధికారంతో వచ్చిన అహంకారం. ఇప్పుడు పవర్ పోవడంతో ఆయన చుట్టూ నిలబడటానికి నలుగురు మనుషులు కూడా ఉండటం లేదు.
నందికొట్కూరు ఎస్సీ నియోజకవర్గం. ఆయన పోటీ చేయలేరు. అనుచరుల్ని మాత్రమే ప్రోత్సహించగలరు. అలా చేయడం ద్వారా వైసీపీ హయాంలో పట్టు తనదేనని అనిపించుకున్నారు. ముఖ్యంగా నందికొట్కూరు మున్సిపాల్టీలో అడ్డమైన పనులు చేసి తన అనుచరుల్ని కౌన్సిలర్లను చేశారు. రైట్ హ్యాండ్ ను మున్సిపల్ చైర్మన్ ను చేశారు. ఇప్పుడు వారంతా బైరెడ్డిని బకరాను చేసి టీడీపీలోకి వెళ్లిపోతున్నారు.
నందికొట్కూరు మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా వైసీపీ 21,ఇండిపెండెంట్ 7 టిడిపి 1 గా గెలుపొందారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి శాప్ ఛైర్మెన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి కనుసన్నల్లోనే పురపాలక సంఘం నడిచేది. ఇప్పుడు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వర్గంగా ఉన్న మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి తో సహా కొంత మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి టిడిపి కండువా కప్పుకున్నారు. దింతో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి వర్గం పూర్తిగా టీడీపీలో చేరిపోయినట్లయింది.
ఇప్పుడు సిద్ధార్థరెడ్డికి రీల్స్ చేసుకోవడానికి కూడా పది మంది వెంట ఉండటం లేదు. ఆయనను పట్టించుకునేవారు కనిపించడం లేదు. బైరెడ్డి శబరి నంద్యాల ఎంపీగా గెలవడంతో.. సిద్ధార్థరెడ్డిని అంతా కమెడియన్ గా చూడటం ప్రారంభించారు.