ఎఫ్ఎన్ సిసి..ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్. ఈ క్లబ్ పేరుకు ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ అనే కానీ, పొలిటికల్, బిజినెస్ పెద్దలు అనేక మంది సభ్యులు. భారీ మొత్తంలో మెంబర్ షిప్ కట్టాలి. మెంబర్ షిప్ అంత సులువుగా దొరకదు కూడా. ఇప్పుడు ఈ క్లబ్ నుంచి నిర్మాత సి కళ్యాణ్ ను సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు కేఎల్ నారాయణ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.
విషయం ఏమిటంటే నిర్మాత సి కళ్యాణ్, మరో సభ్యురాలు విజయారెడ్డి ఈనెల 10న క్లబ్ లోని పేకాట సెక్షన్ లో గొడవ పడ్డారట. ఈ గొడవ కాస్త గట్టిగానే జరిగినట్లు తెలుస్తోంది. దీంతో ఒకళ్ల మీద ఒకళ్లు క్లబ్ నిర్వాహకులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇలా ఇద్దరు సభ్యులు క్లబ్ పర్మిసెస్ లో గొడవ పడడం వల్ల క్లబ్ ప్రతిష్టకు భంగం కలిగించిందని, తదుపరి విచారణ జరిగే వరకు ఇద్దరినీ సస్పెండ్ చేస్తూ అధ్యక్షుడు కెఎల్ నారాయణ నిర్ణయం తీసుకున్నారు.
ఇద్దరు సభ్యుల వివాదం ఏమిటి? వారి మధ్య ఏం జరిగింది, అన్న విషయాల విచారణ జరిపి నివేదిక ఇవ్వమని డిసిప్లిన్ కమిటీకి విషయం నివేదించినట్లు బొగట్టా.