పవన్ కల్యాణ్ పాలకుడు అవుతారని ప్రజలకు ఆయనకు అవకాశం కల్పిస్తారని చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్‌కు తన మద్దతు ఉంటుందన్నారు. అయితే జనసేన పార్టీకి మాత్రం భవిష్యత్‌లో మద్దతు పలుకుతానేమో అన్నట్లుగా మాట్లాడారు. అంటే ఇప్పుడు జనసేన పార్టీకి ఆయన మద్దతు తెలియచేయడం లేదన్నమాట. ఓ రకంగా చెప్పాలంటే చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు.. రాజకీయంగాఎలాంటి ప్రకటనలు చేయదల్చుకోలేదు కాబట్టి ఇలా చెప్పి ఉంటారు. రేపు అవసరం అయితే ఖచ్చితంగా చిరంజీవి జనసేనకు మద్దతు ప్రకటిస్తారు.
చిరంజీవి మొహమాటాన్ని ఆసరాగా చేసుకుని వైసీపీ లాంటి పార్టీలు ఆయన తమ మద్దతుదారుడన్న ప్రచారం చేసుకోవడానికి తాపత్రయ పడుతున్నాయి. ఆయనను పిలిచి దారుణంగా అవమానించి ఆ వీడియోలు విడుదల చేయించి.. సోషల్ మీడియాలో అవమానించి మానసిక తృప్తి పొందిన తర్వాత కూడా ఆయన తమ మద్దతుదారుడని చెప్పుకోవడం వారికే చెల్లింది. అందుకే పవన్ ఎలాంటి విమర్శలు చేసినా ముందుగా చిరంజీవి ప్రస్తావన తెచ్చి రివర్స్ కౌంటర్ ఇస్తూంటారు వైసీపీ నేతలు. ఇప్పుడు వాటికి చిరంజీవి చెక్ పెట్టినట్లే అనుకోవచ్చు.
చిరంజీవి జనసేన పార్టీకి కాకుండా మరో పార్టీకి మద్దతు తెలుపుతారు అంటే.. పవన్ కల్యాణ్‌కు అంతకు మించిన సెట్ బ్యాక్ ఉండదు. జనసేన పార్టీ ఉనికికే ప్రమాదం వస్తుంది. సొంత అన్న.,. మెగాస్టార్ చిరంజీవి కూడా మద్దతివ్వలేదు ఇక ప్రజలెందుకు ఇస్తారన్న విమర్శలు వచ్చేవి. అయితే చిరంజీవి నేరుగా రాజకీయాల్లో పాలు పంచుకోవడం లేదు కాబట్టి ఆయన పరోక్ష మద్దతు లభిస్తోంది. రేపు ఎప్పుడైనా చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రావాలనకుుటే .. జనసేన ద్వారానే అనే విషయం మాత్రం ఇప్పటికి ఓ క్లారిటీ ఇచ్చారని అనుకోవచ్చు.