క్యాన్స ర్ పై అవగాహన తెచ్చుకుంటే పూర్తిగా నివారణ పొందవచ్చని హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. ‘లైఫ్ ఎగైన్’ ఫౌండేషన్ ఆధ్వర్యం లో విశాఖ రామకృష్ణ బీచ్లో క్యాన్సర్ అవగాహన నడక జరిగింది. శనివారం ఉదయం కాళీమాత ఆలయం నుంచి వైఎంసీఎ వరకు నడక నిర్వహించారు. సినీనటి గౌతమి ఆధ్వర్యంలొ ఈ కార్యక్రమం జరిగింది..
ఈ సందర్బంగా బాలకృష్ణ మాట్లాడుతూ..గౌతమి గారు క్యాన్సర్ పై అవగాహన కల్పించెందుకు రెండు రాష్ట్రాల్లొ మంచి కార్యక్రమాలను చెపడుతున్నారు.
పేదలకు క్యాన్సర్ వైద్యం అందించాలనే ఉద్ధేశంతో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని తన తండ్రి ఎన్టీఆర్ ప్రారంభించారని తెలిపారు. 40 పడకలతో మొదలైన ఈ ఆస్పత్రిలో ప్రన్తుతం 512 పడకలు ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా క్యాన్సర్ ను జయించిన పలువురిని అభినందించి పత్రాలను అందజేశారు.
గౌతమి మాట్లాడుతూ.. బాలకృష్ణ గారు షూటింగ్ లొ ఎంతో బిజిగా ఉండి కూడా క్యాన్సర్ అవగాహాన కార్యక్రమానికి తనవంతు సపొర్ట్ అందించారు. బసవతారకం హాస్పిటల్ ద్వారా ఎందరికొ క్యాన్సర్ ట్రీట్ మెంట్ ను అందిస్తూ, అవగాహన కల్పిస్తున్నందకు బాలయ్య బాబు కు ధన్యవాదాలు. బాలకృష్ణ గారిని స్పూర్తిగా తిసుకుని క్యాన్సర్ పై అందరికీ అవగాహాన కల్పించెందుకు అందరు కృషి చెయాలన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలొ లైఫ్ ఎగైన్ కో ఫౌండర్ హైమా రెడ్డి తదితరులు పాల్గొన్నారు