చంద్రబాబును ఎలాగైనా అరెస్ట్ చేయాలన్న పంతాన్ని హైకోర్టు వేసవి సెలవుల్లో జగన్ పూర్తి చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారని ఏపీ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అమరావతి ఇన్నర్ రింగ్‌రోడ్‌లో అక్రమాలకు పాల్పడ్డారంటూ చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. ల్యాండ్ పూలింగ్ కేసులు గతంలోనే తేలిపోయాయి కాబట్టి ఈ సారి కొత్తగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ విషయంలో మార్పుచేర్పులు చేశారని దీని వల్ల సాధారణ ప్రజలకు నష్టం జరిగిందని.. ఇతరులు లబ్ది పొందారని ఆయన ఫిర్యాదు చేశారు.
ఏ కేసులో అయినా తాము నష్టపోయామని బాధితులు కేసులు పెడుతూ ఉంటారు. కానీ అమరావతి కేసుల్లో మాత్రం ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేస్తూంటారు. సీఐడీ కేసులు నమోదు చేస్తూ ఉంటారు. ఈ ఐఆర్ఆర్ అలైన్మెంట్ ఖరారులో అవినీతి జరిగిందని.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఒక్క రైతు కూడా ఫిర్యాదు చేయలేదు. కానీ ఎమ్మెల్యే మాత్రం సామాన్యులకు …. ప్రజల ఆస్తులకు నష్టం చేకూర్చారని ఫిర్యాదు చేశారు. ఎవరికి నష్టం చేశారు…? ఎలా నష్టపోయారు? అన్న అంశాలు ఎఫ్ఐఆర్లో లేవు. సీఐడీ పోలీసులు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారని.. ప్రాథమిక దర్యాప్తు నిర్వహించామని.. ఆ దర్యాప్తులో ఆధారాలున్నాయని కేసులు పెట్టామని ఎఫ్ఐఆర్లో చెప్పారు.
చేతిలో పోలీసులు ఉన్నారు. అధికారం ఉంది. ఎలాంటి కేసులు పెట్టి అయినా ఎలాంటి విచారణలు లేకుండా పట్టపగలు అరెస్ట్ చేసి తీసుకెళ్లే… వ్యవస్థను కూడా సృష్టించుకున్నారు. ఇంకేముంది ఎవరిపై కావాలంటే వారిపై కేసులుపెట్టి అరెస్టులు చేసుకుంటూ పోతున్నారు. అవి ఎలాంటి కేసులన్న సంగతి తర్వాత ముందుగా ఎవరో ఒకరితో ఫిర్యాదుచేయించడం అరెస్టులు చేయిండం .. తర్వాత వారు బెయిల్ తెచ్చుకుంటే న్యాయస్థానాన్ని తప్పుపట్టడం కామన్ అయిపోయింది. ఈ లెక్కను చంద్రబాబును కూడా నోటీసుల్లేకుండా ఎప్పుడైనా అరెస్ట్ చేసి తీసుకెళ్లినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది.