తిరుమలలో తోమాల సేవ టిక్కెట్లు ఇప్పిస్తామని చెప్పి రెండున్నర లక్షలు వసూలు చేసి మోసం చేశారని గుంటూరుకు చెందిన కొంత మంది వ్యక్తులు కుప్పం ఎమ్మెల్సీ భరత్ తో పాటు ఆయన పీఏపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాము ఆన్ లైన్ లో డబ్బులు ట్రాన్స్ ఫర్ చేశామని వాటికి సంబంధించిన ఆధారాలను సమర్పించారు. వాట్సాప్ చాట్స్, ఇతర ఆధారాలు కూడా ఇచ్చారు.
చంద్రబాబుపై పోటీ చేసిన భరత్ ఎమ్మెల్సీగా ఉన్నారు. వైసీపీ హయాంలో సిఫారసు లేఖల ద్వారా టిక్కెట్లు అమ్ముకోవడం పెద్ద వ్యాపారంగా మారింది. దాన్నే టీడీపీ హయాంలోనూ కొనసాగించేందుకు ప్రయత్నిచారు. ఎమ్మెల్సీగా తన లేఖలను టిక్కెట్ల అమ్మకానికి వినియోగించుకునేందుకు ప్రయత్నించారు. అయితే అనుకున్న విధంగా టిక్కెట్లు దక్కకపోవడంతో డబ్బులు ఇచ్చిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read : కుప్పం వైసీపీ టీడీపీకి సరెండర్ !
కుప్పంలో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో భరత్ చేసిన నిర్వాకాలు అన్నీ ఇన్నీ కావు. చంద్రబాబు పర్యటనలో రాళ్ల దాడులు కూడాచేయించారు. ఆ భయంతో ఇప్పుడు ఆయన కుప్పం కూడాపోవడం లేదు. కీలక నేతలంతా కుప్పం నుంచి పరారయ్యారు. ఇప్పుడు గుంటూరులో ఆయనపై కేసు నమోదయింది.