పవన్ కల్యాణ్, ఆయన కుటుంబంపై ఇష్టారీతిన బూతులు తిట్టిన పోసాని కృష్ణమురళిపై రాజమండ్రిలో పోలీసు కేసు నమోదైంది. వైసీపీ కోసం అలా తిట్టిన పోసానిపై కేసు పెట్టే సాహసం పోలీసులు చేయరు కానీ.. కోర్టు ఆదేశించింది.. కాబట్టి కేసు పెట్టేశారు. ఈ కేసులో విచారణ జరిపి పోసాని అలా తిట్టారో లేదో తేల్చాల్సి ఉంటుంది. పోలీసులు తేల్చరు. కానీ కేసు అలాగే ఉంటుంది. రేపు ప్రభుత్వం మారితే అప్పుడు కేసు బయటకు వస్తుంది. అర్థరాత్రి పోసానిని ఇంట్లో నుంచి తీసుకు వచ్చి .. ఆ చేసిన వ్యాఖ్యలకు సరైన శిక్షను ప్రస్తుత ఏపీ సీఐడీ తరహాలో ఇచ్చే చాన్స్ ఉంటుంది.
ఓ సారి కేసు నమోదయ్యాక.. తప్పించుకోవడం పోసాని కృష్ణమురళికి సాధ్యం కాదు. పోలీస్ కథలను చాలా సినిమాలకు ఇచ్చిన పోసానికి ఇది తెలియనిదేం కాదు. ఆయన అన్న మాటలు కూడా చిన్నవేం కాదు. పోసానితో రాజకీయ పరంగా ఎలాంటి వైరుధ్యాలు కానీ.. మరో విధంగా కానీ మెగా కుటుంబానికి లేవు. కానీ పోసాని వైసీపీ అధినేత జగన్ కు మద్దతుగా మాట్లాడాలంటే.. పవన్‌ను.. చిరంజీవిని.. ఆయన తల్లిని.. కుటుంబానని దారుణంగా తిట్టాలనే ధీరి పెట్టుకున్నారు. తిట్టారు. దానికి ప్రతిఫలంగా పదవి కూడా పొందారు. కానీ రోజులు ఎల్లప్పుడూ ఒకేలా ఉండవు కదా ! మారితే
నిజానికి పోసాని తిట్టింది ఒక్క పవన్ ను మాత్రమే కాదు.. చంద్రబాబును ఆయన కుమారుడు లోకేష్‌ను..ఆయన కుటుంబాన్ని కూడా బండ బూతులు తిట్టారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే తిట్టారు. కాకపోతే అప్పట్లో టీడీపీ ప్రభుత్వం.. ఇప్పటి ప్రభుత్వంలా అనుకోలేదు. ప్రజాస్వామ్యం అనుకుంది. కానీ ఇక ముందు అలా అనుకునే అవకాశం ఉండదు. అందుకే పోసానిపై నమోదైన కేసు.. వెంటాడే అవకాశం ఉంది. అప్పటికప్పుడు పెట్టిన కేసుల కన్నా.. వైసీపీ హయాంలో పెట్టిన కేసులో పోసానికి సినిమా చూపించడంలో తిట్లు అనుభవించిన వారికి కిక్ ఉంటుంది.