డ్రగ్స్ అంటే వైసీపీ పేరు ఖచ్చితంగా వస్తోంది. ఏదో ఆషామాషీగా మీడియాలో వచ్చే కథనాలు కాదు. నేరుగా పోలీసు కేసుల్లో ఇరుక్కుంటున్నవారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏ 2గా నిలిచిన అరుణ్ కుమార్.. చిత్తూరు జిల్లాకు చెందిన వారు. ఆయనను అరెస్టు చేశారు. ఆయన సోషల్ మీడియా ఖాతాల్ని చూస్తే వైసీపీ నేతలకు చాలా సన్నిహితుడని తెలుస్తుంది.
ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. ఆయన ఎమ్మెల్యే స్టికర్ ఉన్న కారు దొరకడమే కారణం. ఆ కారు వాడింది పూర్ణారెడ్డి అని గుర్తించారు. ఆయన ఎవరంటే.. కాకాణికి అత్యంత సన్నిహితుడు, వ్యాపారభాగస్వామి అని చెబుతున్నారు. రైడ్ జరిగిన రోజున కారు వదిలేసి చాకచక్యంగా పారిపోయారు. తర్వాత ఆయనను పిలిచి .. అరెస్టు చూపించి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించారు బెంగళూరు పోలీసులు. ఎమ్మెల్యేకు నాలుగు స్టిక్కర్లు మాత్రమే ఇస్తారు. వాటిలో ఒకటి కాకాణి పూర్ణారెడ్డికి ఇచ్చారంటే ఎంత సన్నిహితుడో చెప్పాల్సిన పని లేదు.
మరకంతా తమ మీదకు వచ్చేసరి వైసీపీ మీడియా.. టీడీపీ నేతలు ఉన్నారంటూ బరద చల్లడం ప్రారంభించింది. కానీ వారి పేర్లను కానీ.. వారిపై కేసులను కానీ బెంగళూరు పోలీసులు నమోదు చేయలేదు. వారిని అరెస్టు చేయలేదు. తమ నేతలు దొరికిపోయారు కాబట్టి బట్ట కాల్చి టీడీపీ మీద వేయాలని ప్రయతనిస్తున్నారు. కానీ ఎలాగోలా ఇరికించేయడానికి వాళ్లేమీ ఏపీ పోలీసులు కాదుగా.. కర్ణాటక పోలీసులు