హైదరాబాద్: అరకు లోక్‌సభ ఎంపీ కొత్తపల్లి గీతపై కేంద్ర పరిశోధక సంస్థ సీబీఐ ఛార్జిషీట్ నమోదు చేసింది. తప్పుడు పత్రాలతో పంజాబ్ నేషనల్ బ్యాంకును మోసంచేసి రు.42 కోట్లను స్వాహా చేసినట్లు సీబీఐ ఆరోపణ. గీతపై, ఆమె భర్తపై వారి సంస్థ ఎండీ, సహకరించిన బ్యాంక్ అధికారులపై ఛార్జిషీట్లో వివిధ సెక్షన్లకింద అభియోగాలు నమోదు చేసింది. వీరిని త్వరలో అరెస్ట్ చేసే అవకాశముందని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన గీత, తర్వాత నాయకత్వంపై అసంతృప్తితో ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు.