కేసీఆర్ సర్కార్ లో కీలకంగా వ్యవహరించి, బీహార్ బ్యాచ్ అంటూ రాజకీయ ప్రత్యర్థులకు టార్గెట్ కూడా అయిన వ్యక్తి మాజీ సీఎస్ సోమేష్ కుమార్. సీఎస్ గా, వాణిజ్య పన్నుల శాఖ సెక్రెటరీగా సోమేష్ కుమార్ చక్రం తిప్పారు. ఓ దశలో సీఎం తర్వాత మోస్ట్ పవర్ ఫుల్ గా తయారయ్యారు.
ఆనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో జరిగిన అవకతవకలపై రేవంత్ సర్కార్ ఫోకస్ చేయగా వాణిజ్య పన్నుల శాఖలో ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లినట్లు తేలింది. రాష్ట్రానికి ఆదాయం వచ్చే శాఖల్లో ఒకటైన కీలకమైన వాణిజ్య పన్నుల శాఖపై సర్కార్ ఫోరేన్సిక్ ఆడిట్ చేయించగా… అసలు విషయం బయటకొచ్చింది.
Also Read : జిల్లాల కుదింపు… రేవంత్ సర్కార్ వెనక్కి తగ్గినట్లే?
మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచనతో ఆనాటి కమిషనర్, డిప్యూటీ కమిషనర్ లు ఏకంగా కమర్షియల్ ట్యాక్సుల పోర్టల్ లోనే మార్పులు చేర్పులు చేయించారు. ఎవరికీ అనుమానం రాకుండా చేశారు. ఇందుకోసం ఐఐటీ-హైదరాబాద్ కు చెందిన ఓ ప్రొఫెసర్ సహయం తీసుకున్నట్లు తేలింది. ఇందుకోసం ఓ వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని… అక్రమాలకు పాల్పడ్డట్లు తేల్చారు.
వాణిజ్య శాఖలో జరిగిన అక్రమాలు, అవకతవకలపై పూర్తి స్థాయి విచారణకు ప్రభుత్వం ఆదేశించనుంది.