ప్రభుత్వ యంత్రాగాన్ని దుర్వినియోగం చేసి రాజకీయాలకు వాడుకోవడంలో జగన్ రెడ్డిని మించిన వారు లేరు. ఆయన రాజకీయసభలను బటన్ నొక్కుడు పేరుతో ప్రజాధనంతో పెట్టేస్తున్నారు. అంతేనా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వైసీపీ కోసం పని చేసేలా చేస్తున్నారు. గడప గడపకూ మన ప్రభుత్వం అని పేరు పెట్టి పార్టీ నేతల్ని తీసుకుని అధికారులు ఇంటింటికి వెళ్లి మీకు ఇన్ని లక్షలిచ్చాం అని చెబుతున్నారు. అదే పద్దతిని అడాప్ట్ చేసుకునేందుకు కేంద్రంలో బీజేపీకూడా బీజేపీ కూడా రెడీ అయింది.
గత తొమ్మిది సంవత్సరాల మోడీ పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను నవంబర్ 20వ తేదీ నుండి జనవరి 25 వరకూ ప్రచారం చేసేందుకు కేంద్రర ఉద్యోగులతో కమిటీలను నియమిస్తోంది. ప్రభుత్వం సాధించిన విజయాలను గురించి ప్రచారం చేసేందుకు, వాటిని ప్రదర్శించేందుకు దేశంలోని మొత్తం 765 జిల్లాల్లో ప్రత్యేక అధికారులను నియమించాలని అన్ని మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందులో రక్షణ శాఖ కూడా ఉండటంతో విమర్శలు ప్రారంభమయ్యాయి.
ప్రభుత్వ ఉద్యోగుల్ని రాజకీయ అవసరాలకు.. రాజకీయ ప్రచారానికి వాడుకోవడం నిషిద్ధం. కానీ తెగిస్తున్న కొన్ని రాజకీయ పార్టీలు.. ప్రభుత్వ ప్రచారం పేరుతో పార్టీ ప్రచారం చేస్తున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ఇదే పని చేస్తున్నారు. నిజంగా ప్రజలకు మేలు జరిగి ఉంటే.. వారికి ప్రభుత్వ అధికారి వచ్చి మీకు ఈ మేలు ప్రభుత్వం చేసిందని చెప్పాల్సిన పని లేదు. లబ్ది పొందింది వారే కాబట్టి .. వారికి తెలియకుండా ఉంటుందా .? కానీ కేంద్ర రాష్ట్రాలు ఇలాంటి ట్రిక్‌లను ప్లే చేస్తూనే ఉన్నాయి. ప్రజలు ఏమనుకుంటారన్న విషయాన్ని పూర్తిగా మర్చిపోతున్నారు. ఇది సహజమే అన్న అభిప్రాయాన్ని కల్పిస్తూండటమే దీనికి కారణం.