కృష్ణా, గుంటూరు, ఖమ్మం జిల్లాలకు వచ్చిన అసాధరాణ వరదల విషయంలో కేంద్రం సత్వరం స్పందించింది. స్వయంగా ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో మాట్లాడారు. హోంశాఖ తరపున అమిత్ షా .. ఆయా రాష్ట్రాలు అడిగిన సరంజామా కంటే ఎక్కువే పంపించారు. పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్లు జరిగాయి. విజయవాడలో పదుల సంఖ్యలో హెలికాప్టర్లు, పవర్ బోట్లను పంపారు.
కేంద్రం సాయం ఇంత లేకపోతే వరద కష్టాలు ఇంకా ఎక్కువ ఉండేవి. అంతా నీటిలో మునిగిపోయినా.. తరవత ప్రాణ నష్టం జరగకుండాచూసుకోవడంలో యంత్రాంగం అంతా సక్సెస్ అయింది. ఆరోగ్య సమస్యలు ఉన్న వారి విషయంలో ప్రత్యేక సమాచారం తెప్పించుకుని జాగ్రత్తలు పడ్డారు. కేంద్రం ఆర్థిక సాయం కూడా చేస్తుంది. సంప్రదాయకంగా అందుబాటులో విపత్తుల నిధి నుంచి కావాల్సినంత వాడుకోవచ్చు. తర్వాత కంద్రం చేసే సాయం కేంద్రం చేస్తుంది.
ప్రకృతి విలయాల విషయంలో ఎవర్నీ నిందించలేం. కానీ ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా… కాపాడుకునే విషయంలో పాలకులు నిర్లక్ష్యంగా ఉంటే మాత్రం క్షమించరాని విషయమే. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు శక్తికి మించి ప్రజల్ని ఆదుకునే ప్రయత్నం చేశాయి. అదే ప్రజలకు ఊరట.
అయితే రెండు రాష్ట్రాలు ఈ వరదల్ని జాతీయ విపత్తుగా పరిగణించి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నాయి. అయితే జాతీయ విపత్తగా పరిగణించాలంటే.. కొన్ని పారామీటర్స్ ఉంటాయి. వాటిని అందుకుంటే ప్రకటించే అవకాశం ఉంది. కేరళ వాయనాడ్ వరదల్ని కూడా జాతీయ విపత్తుగా ప్రకటించలేదు. పరిశీలిస్తామని కేంద్రం చెప్పింది.