భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం ప్రకటించింది. రెండు రాష్ట్రాలకు కలిపి 3,300కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్లు వెల్లడించింది.
వరదలతో నష్టపోయిన తెలుగు రాష్ట్రాలను ఆదుకోవాలని తెలంగాణ , ఏపీ ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి , చంద్రబాబులు కేంద్రాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ, ఏపీలో వరద ప్రభావిత ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం తరఫున మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గురు, శుక్రవారాల్లో వరుసగా తెలుగు రాష్ట్రాల్లో ఏరియల్ సర్వే చేపట్టి జరిగిన నష్టాన్ని పరిశీలించారు.
ఇటీవలి భారీ వర్షాల కారణంగా రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయాయని , ఈమేరకు కేంద్రం నుంచి రాష్ట్రాలకు సంపూర్ణ సహకారం అందిస్తామని శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం మధ్యాహ్నమే ప్రకటించారు. ఆయన ప్రకటించిన గంటల వ్యవధిలోనే కేంద్రం భారీ సాయం చేస్తామని వెల్లడించింది. రెండు రాష్ట్రాలకు కలిపి 3,300కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది.