శుక్రవారం విడుదలైన ఛల్ మోహన రంగ సినిమా చూస్తుంటే… త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలే అందించాడా, లేదంటే సీన్లు కూడా రాసిచ్చేశాడా? అనిపిస్తుంటుంది. ఎందుకంటే.. చాలా చోట్ల దర్శకుడు కృష్ణ చైతన్య త్రివిక్రమ్‌నే ఫాలో అయిపోయాడు. జాకీ సీన్, మందు తాగి సత్యని కొట్టడం, క్వాయిన్ ఫైట్, చివర్లో పార్టీ సీన్… ఇవన్నీ త్రివిక్రమ్ మార్క్ సన్నివేశాలే. త్రివిక్రమ్ రాసిన కథని, త్రివిక్రమ్ స్టైల్లో తీసిన దర్శకుడ్ని అభినందించాల్సిందే. అయితే.. ఈ ఐడియాలు కూడా త్రివిక్రమ్ ఇచ్చినవే అట. కథకుడిగా స్టోరీ చెబుతున్నప్పుడే… కృష్ణ చైతన్యకి కొన్ని ఐడియాలు అందించాడట త్రివిక్రమ్. దాన్ని కృష్ణ చైతన్య బాగానే వాడుకున్నాడు. అవన్నీ సినిమాలో పండాయి కూడా. ఓ రకంగా చెప్పాలంటే బలహీనమైన ఈ కథకు అవే కాస్త సత్తువ ఇచ్చాయి. ఎంటర్టైన్ మెంట్ పరంగా ఈ సినిమా మంచి మార్కులు అందుకొంది. ఎమోషన్ కూడా యాడ్ అయి ఉంటే.. బాగుండేది అనేది సినీ జనాల మాట.