హైదరాబాద్: విప్లవ రచయితల సంఘం(విరసం) నాయకుడు చలసాని ప్రసాద్ (83) తుది శ్వాస విడిచారు. విశాఖపట్నంలో గుండెపోటుతో మరణించారు. విరసం వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన చలసాని ప్రసాద్ కృష్ణా జిల్లా పెనుమర్రు వాస్తవ్యులు. ప్రముఖ విప్లవ కవి శ్రీశ్రీకి అత్యంత సన్నిహితులు. కవయిత్రి రంగనాయకమ్మకూ చలసాని అంటే ఎంతో అభిమానం.
విప్లవ రచయితగా, ప్రజా ఉద్యమాలను సమర్థించే కార్యకర్తగానే ఆయన జీవితమంతా గడిపారు. ఉద్యమాల అణచివేతపై గళమెత్తారు. ఈ క్రమంలో అనేక సార్లు జైలుకు వెళ్లారు. విరసం ప్రస్థానంలో చలసానిది చెరగని ముద్ర ఆయన మృతికి పలువురు విప్లవ రచయితలు, సామాజిక కార్యకర్తలు సంతాపం తెలిపారు.
చలసాని ప్రసాద్ నిజాయితీ పరుడు, నిరాడంబరుడని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. చలసాని ప్రసాద్ కు ఆయన నివాళి అర్పించారు. ఇలు కలాన్నే కరవాలంగా చేసుకుని విప్లవ రచనలుచేస్తూ, అటు పేద ప్రజల తరఫున పోరాడిన సవ్యసాచి అని కీర్తించారు.