టీడీపీ – వైసీపీకి మధ్యనున్న తేడా ఏంటో మరోసారి స్పష్టమైంది. మహిళలను వేధింపులకు గురి చేస్తే ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని టీడీపీ స్పష్టం చేస్తుండగా..వైసీపీ మాత్రం ఈ కేటగిరికి చెందిన నేతలను అంటిపెట్టుకొని రాజకీయంగా ఎదగాలని చూస్తోంది.
వైసీపీ హయాంలో కీలక నేతలు సహా వాలంటీర్ల వరకు మహిళలను వేధించారు. నాటి మంత్రులు , ఎమ్మెల్యేలు, ఎంపీలు మహిళలను లైంగిక వేధింపులకి గురి చేశారు. దీనిపై ఫిర్యాదులు చేసేందుకు బాధితులకు ధైర్యం చాల్లేదు. ఎక్కడో చోట ఫిర్యాదులు చేసినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.
అధికారం కోల్పోయాక కూడా కొంతమంది వైసీపీ నేతల తీరు ఏమాత్రం మారడం లేదు. మహిళలతో ఇంకా అసభ్యంగా ప్రవర్తిస్తూనే ఉన్నారు. దువ్వాడ వంటి నేతలు భార్యకు విడాకులు ఇవ్వకుండానే మరో మహిళతో సహజీవనం కొనసాగిస్తున్నారు. అలాంటి నేతలకు వైసీపీ షెల్టర్ జోన్ గా మారిందన్న విమర్శలు వచ్చాయి.
దువ్వాడ వ్యవహారంలో వైసీపీపై తీవ్ర విమర్శలు రావడంతో కేవలం ఇంచార్జ్ పదవి నుంచి తప్పించేశారు. కాని, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఓ మహిళను వేధించారని తెలియగానే టీడీపీ అధిష్టానం ఆలస్యం చేయకుండా చర్యలు చేపట్టింది.
ఇలాంటి వాటిని ఏమాత్రం ఉపేక్షించవద్దని ఎమ్మెల్యే నుంచి వివరణ కూడా కోరకుండానే ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది . మహిళలను వేధించినట్లు తేలితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తాజా నిర్ణయంతో అధికార పార్టీ సంకేతాలు ఇచ్చింది.
ఈ ఎమ్మెల్యే కూడా గతంలో వైసీపీలో ఉండి ఎన్నికలకు ముందు టీడీపీలో చేరి, గెలిచిన వారే కావడం గమనార్హం