హైదరాబాద్: తెలుగుదేశానికి మిత్రుడైన పవన్ కల్యాణ్ మాటలను హితవుగానే తీసుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తమ ఎంపీలకు సూచించారని తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా విషయంలో సీమాంధ్ర ఎంపిలు ఏంచేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ ఇటీవల తీవ్రమైన వ్యాఖ్యలతో నిలదీసిన విషయం తెలిసిందే. దానిపై విజయవాడ, మచిలీపట్నం ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ళ నారాయణ తీవ్రంగా ప్రతిస్పందించారు. ఈవిషయం నిన్న విజయవాడలో జరిగిన తెలుగుదేశం ఎంపిల సమావేశంలో ప్రస్తావనకొచ్చినపుడు బాబు పైవిధంగా స్పందించారు.
మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వటానికి రికార్డుల పరంగా అవసరమైన ఆధారాలు, వనరుల క్రోడీకరణ పని శాఖలవారీగా మొదలైందని ఇప్పటికే 60 శాతం పని జరిగిందని అధికారుల సమాచారాన్ని కోట్ చేస్తూ మంత్రి సుజనా చౌదరి నిన్న సమావేశంలో వివరించినట్లు సమాచారం. ఇంకో నెలన్నరలో ప్రత్యేకహోదాపై పూర్తి ఫైలు సిద్ధమౌతుందన్నారని తెలిసింది