రాజధాని అమరావతిని పరుగులు పెట్టించేందుకు సర్కార్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. అమరావతిలో ఆగిపోయిన నిర్మాణాలు ఏవీ, ఏ పనులు ఏంత మేర పూర్తి అయ్యాయి, నిలిచిపోయిన భవనాల నిర్మాణం తిరిగి ప్రారంభిస్తే పనికొస్తాయా లేదా అన్న అంశాలపై సీఆర్డీఏ ఇప్పటికే ఫోకస్ చేసింది.
తాజాగా అమరావతికి సంబంధించి అన్ని నివేదికలు తెప్పించుకున్న సీఎం… కీలక మీటింగ్ ఏర్పాటు చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబుతో పాటు మున్సిపల్ శాఖ మంత్రితో సహా 11మంది సభ్యులు హజరుకాబోతున్నారు.
Also Read : ఆగిపోయిన నిర్మాణాలు పనికొస్తాయా?… అమరావతికి ఐఐటీ నిపుణులు
గతంలో నిలిచిపోయిన భూసేకరణ, కొత్తగా అప్లై చేసుకున్న కంపెనీలకు భూ కేటాయింపులు, కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 15వేల కోట్ల ఫండ్ ఖర్చుకు ఇచ్చిన విధివిధానాలతో పాటు విధానపరమైన నిర్ణయాలను తీసుకునే అవకాశం ఉంది.
నిర్మాణాల విషయంలో సీఎం అక్కడికక్కడే సూచనలు చేసే వీలుందని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరావతి నుండే అన్ని కార్యకలాపాలు జరిగేలా… శాశ్వత నిర్మాణాలను టైం బాండ్ పెట్టి పనులు చేయించాలని సీఎం ఇప్పటికే సీఆర్డీఏకు సూచించారు. అవసరం అయితే సీఆర్డీఏలో ఉద్యోగుల సంఖ్యను పెంచే అవకాశం కూడా కనిపిస్తోంది.