వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో అలసత్వం ప్రదర్శించవద్దని సీఎం చందబాబు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తున్నారా, లేదా అని తెలుసుకునేందుకు చంద్రబాబు స్వయంగా రంగంలోకి దిగారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు ప్రాంతాల్లో వరద బాధితులకు అందుబాటులో ఉండేలా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. తాను చెప్పిన ప్రాంతానికి వెళ్లి సహాయక చర్యలో పాల్గొనాలని.. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తున్నారు.
చంద్రబాబు వరుస తనిఖీల నేపథ్యంలో అధికారయంత్రాంగం వరద బాధితుల వద్దకు పరుగులు పెడుతోంది. అధికారులు ఎవరూ తన వెంట రాకుండా సహాయక చర్యల్లో భాగం కావాలని ఆదేశించారు. ప్రజలకు ఈ కష్టకాలంలో తోడుగా ఉండాలని సూచించారు.
వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాల్లో అక్కడి పరిస్థితిపై తనకు ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలన్న చంద్రబాబు..ప్రభుత్వ పరంగా ఎలాంటి సహాయం చేసేందుకైనా సర్కార్ సిద్దంగా ఉందని స్పష్టం చేస్తున్నారు.