చంద్రబాబు శ్వేత పత్రాల విడుదల వెనక ఆయన వ్యూహం ఏంటో కానీ వైసీపీ నేతలు మాత్రం బెదిరిపోతున్నారు. పోలవరం, అమరావతి, విద్యుత్ , సహజ వనరుల దోపిడీపై శ్వేతపత్రాల వరకు అంతా ఏదో సాగిపోతుందిలే అనుకుంటుండగా..చంద్రబాబు తాజాగా బిగ్ షాక్ ఇచ్చారు.
మద్యం కుంభకోణంపై బుధవారం అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేసిన చంద్రబాబు..మద్యం అమ్మకాల్లో లక్ష కోట్ల అవినీతి జరిగిందని..ఆ అవినీతి ఆనకొండలు ఎవరో తేల్చేందుకు సీబీ సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్లు చేసిన ప్రకటన వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
Also Read : మద్యం కుంభకోణంపై సీఐడీ విచారణ.. చంద్రబాబు కీలక నిర్ణయం
అయితే..మద్యం కుంభకోణంలో మాత్రమే విచారణకు ఆదేశిస్తున్నటు చంద్రబాబు ప్రకటించినా వివిధ శాఖలో అవినీతికి పాల్పడిన నేతలు సైతం కంగారు పడుతున్నారు. మద్యం కుంభకోణంపై విచారణకు ఆదేశించిన చంద్రబాబు..త్వరలోనే పోలవరం, భూదోపిడీల విషయంలోనూ విచారణకు ఆదేశిస్తే తమ పరిస్థితి ఏంటని హైరానా పడుతున్నారు.
ఇప్పటికే జగన్ కు సైతం హెచ్చరికలు పంపారు చంద్రబాబు. హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే సమాధానం చెప్తామని అనడంతో.. ఏం జరగనుంది అనే చర్చ వైసీపీలో అప్పుడే స్టార్ట్ అయిపోయింది. దీంతో ఒక్కొక్కటీ లీగల్ గానే వైసీపీకి చుక్కలు చూపించేందుకు చంద్రబాబు రెడీ అయిపోయారు అనేలా తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి అంటున్నారు.