ఎవరైనా పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామిక వేత్తల్ని అడుగుతారు.. కానీ చంద్రబాబు ఆ పారిశ్రామిక వేత్తలతోనే ఓ కమిటీ వేసి ఏపీకి పెట్టుబడులు తేవాలని పురమాయిస్తారు. టాటా గ్రూప్ చైర్మన్ తన కంపెనీల నిర్వహణలో తీరిక లేకుండా ఉంటారు. ఆయననే ఒప్పించింది… ఏపీకి పెట్టుబడులు వచ్చేలా ఇతర పారిశ్రామికవేత్తలతో ఓ టాస్క్ ఫోర్స్‌ను నియమించేశారు చంద్రబాబు. వారి మదిలో పెట్టుబడుల ఆలోచనలు.. వారి గ్రూపులో కొత్త ఆలోచనలు వస్తే…. తమ మాట వినే ప్రభుత్వం తమ ముందున్న ఆలోచన వారికి వస్తుంది. చంద్రబాబుకు కావాల్సింది కూడా ఇదే.
పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు జరిగిన భేటీలో పలువురు పలు రకాల ప్రతిపాదనలు చేశారు. ఫార్మా రంగం నుంచి రెడ్డీస్ ల్యాబ్స్ ఓనర్ సతీష్ రెడ్డి జీనోమ్ వ్యాలీ తరహా ఏర్పాటు ఉండాలని.. సూచించారు. అంటే.. అలాంటి ది ఏర్పాటు చేస్తే రెడ్డీస్ ల్యాబ్స్ ఖచ్చితంగా పెట్టుబడులు పెడుతుంది. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్, టూరిజంపై ఐటీ, స్కిల్ డెలవప్‌మెంట్‌పై బజాజ్ వంటి గ్రూపులు సలహాలు ఇచ్చాయి. పారిశ్రామికవేత్తలతో చంద్రబాబుకు సత్సంబంధాలు ఉంటాయి.. ఆయన సమావేశం అని పిలిస్తే ఖచ్చితంగా వస్తారు. తమ విలువైన ఆలోచనలు పంచుకుంటారు.
చంద్రబాబుతో సమావేశానికి వచ్చిన కంపెనీల యజమానులంతా బడా కంపెనీల ప్రతినిధులే. వారి పెట్టుబడుల ప్రణాళికలో మొదటగా ఇక ఏపీ ఉంటుంది. వచ్చే ఐదేళ్లలో టాటా గ్రూప్ ఎనిమిదిన్నర లక్షల పెట్టుబడులు పెట్టాలనుకుంటోంది. అందులో ఓ పది శాతం ఏపీకి వచ్చినా… భారీ పెట్టుబడి వచ్చినట్లే. మిగిలిన పారిశ్రామిక వేత్తల మదిలోనూ ఏపీ ఉంటుంది. చంద్రబాబు వ్యూహం వర్కవుట్ అవుతుంది. ఏపీకి పెట్టుబడులు.. యువతకు ఉపాధి లభిస్తుంది.