“కష్టపడి పని చెయ్ ఫలితం దానంతట అదే వస్తుంది” అని చాలా మంది చెబుతూ ఉంటారు కానీ ఆచరించడం అంత సామాన్యమైన విషయం కాదు. ప్రయత్నాల్లో చిన్న ఎదురు దెబ్బ తగిలితే పూర్తిగా నీరుగారి పోతారు. పూర్తిగా కిందపడిపోతే ఇక నాకెందుకు అనుకునేవారే ఉంటారు. కానీ కిందపడినా… మళ్లీ లేచి పరుగెట్టే వాళ్లే లక్ష్యాన్ని చేరుకుంటారు. నిజానికి ఇలాంటి స్ఫూర్తితో ఉండేది.. కొత్తగా ఏమీ సాధించని వారే. ఏదో ఒకటి సాధించాలని అనుకుంటారు. అదే జీవితంలో ఎంతో సాధించిన వారికి ఎదురు దెబ్బలు తగిలితే ఇక ఎందుకులే అనుకుంటారు. కానీ వీటన్నింటికీ అతీతం చంద్రబాబు. ఆయన రాజకీయాల్ని కెరీర్ గా ఎంచుకున్నారు. రాజకీయం అంటే ప్రజలకు మేలు చేయడం అనుకుంటారు. వాటిలో తాను అనుకున్న లక్ష్యం సాధించడం కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు.
2014-19 మధ్య ఏపీకి ఓ గోల్డెన్ పిరియడ్. ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. మంచి పారిశ్రామిక వాతావరణం ఏర్పడింది. విద్యుత్ తో స్వయం సమృద్ధి సాధించాం. కరెంట్ బిల్లులు తగ్గిస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఐదేళ్లలో ఆర్టీసీ చార్జీలను కూడా పెంచలేదు. కానీ ప్రతి పల్లెలో అభివృద్ధి కనిపించింది. చంద్రన్న బీమా వంటి పథకాలు… మరణం సంభవించిన ప్రతీ కుటుంబాన్ని ఆదుకున్నాయి. పంక్షేమంలో ఓ బెంచ్ మార్క్ కనిపించింది. పోలవరం పూర్తయ్యే స్టేజ్‌కు వచ్చింది. . అమరావతికి ఓ రూపు వస్తోంది. అలాంటి పాలన అందించిన ఏ సీఎంకు అయినా ప్రజలు అత్యంత దారుణమైన ఓటమిని కట్టబెడితే .. వారికి ఎలా అనిపిస్తుంది ? ఈ ప్రజల కోసమే ఇంత కష్టపడింది అనిపిస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం అలా ఎప్పుడూ అనుకోలేదు. మళ్లీ ప్రజల కోసం పోరాటం ప్రారంభించారు.
ఆయనను వేధించారు. మాటలతో హింసించారు. మానసికంగా నరకాన్ని చూపే ప్రయత్నం చేశారు. కానీ చంద్రబాబు ఎప్పుడూ బ్యాలెన్స్ తప్పలేదు. రాజకీయాలతో సంబంధం లేని భార్యను… తాను రాజకీయ భిక్ష పెడితే ఎమ్మెల్యేలు అయిన వారు అత్యంత దారుణంగా తూలనాడితే .. కన్నీరు పెట్టుకున్నారు. మళ్లీ అలాంటి సభకు సీఎంగానే వస్తానని చాలెంజ్ చేసి వెళ్లారు. అంతే కానీ… ఈ ప్రజలు తనను ఇలా ఓడించి… అవమానించేలా చేస్తున్నారని వారిపై నింద వేయలేదు . గత ప్రభుత్వ పాలనకు.. ప్రస్తుత పాలనకు తేడా చెబుతూ జనంలోకి వెళ్తున్నారు.
కష్టపడి లక్ష్యాన్ని సాధించడంలో చంద్రబాబు యువతకు ఓ రోల్ మోడల్. జీవితాన్ని ఎలా బాగు చేసుకోవాలో .. ఎలా కష్టపడాలో కెరీర్ లో ఎదగాలనుకునేవారికి చంద్రబాబు ఓ రోల్ మోడల్. తీసుకునే నిర్ణయాలు ఇప్పటికికాదు పదేళ్ల ముందు చూపుతో ఉండాలని ఆలోచించే వారికి చంద్రబాబు ఓ రోల్ మోడల్. రాజకీయాల్లో ఆయనో యూనివర్శిటీ. నిరంతర రాజకీయ శ్రామికుడు.
హ్యాపీ బర్త్ డే చంద్రబాబునాయుడు గారు !