పట్టుబట్టి ముఖ్యమంత్రి హోదాలో పోలవరం పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనకు…ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉన్న అధికారులందరూ దూరంగా ఉన్నారు. కేవలం ప్రాజెక్టుకు చెందిన చీఫ్ ఇంజినీర్లు, ఇతర అధికారులు మాత్రం…చంద్రబాబు టూర్లో పాల్గొన్నారు. ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ తదితరలు…చంద్రబాబు టూర్లో కనిపించలేదు. దీంతో చంద్రబాబు పోలవరం టూర్‌కి కోడ్ దెబ్బ పడినట్లయింది. పోలవరం ఈఎన్సీ వెంకటేశ్వరరావు, పోలవరం సీఈ శ్రీధర్ మాత్రమే హాజరయ్యారు. చంద్రబాబు మొదట.. ప్రాజెక్ట్ నిర్మాణంపై ఏరియల్ సర్వే చేశారు. తర్వాత ఎగువ, దిగువ కాపర్ డ్యామ్ పనులు… గేట్ల బిగింపు… మెయిన్ డ్యామ్ పనులను పరిశీలించారు.
పోలవరం వ్యూ పాయింట్ నుంచి పనులు పరిశీలించారు. పోలవరం మెయిన్ డ్యామ్ వద్ద గేట్లను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 70శాతం మేర పూర్తయిన పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తయ్యాయని.. అదికారులు చంద్రబాబుకు వివరించారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత చంద్రబాబు పోలవరంలో పర్యటించడం ఇదే తొలిసారి. పోలవరం ఏపీ ప్రజల చిరకాల వాంఛని.. పోలవరం ద్వారా 45లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. పోలవరం పూర్తయితే కరువును జయించవచ్చని.. ఈ ఏడాదే గ్రావిటీ ద్వారా సాగునీరందిస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 980 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవకాశం ఉందన్నాయి.
పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి ఇప్పటి వరకు రూ. 16,493 కోట్లు ఖర్చు చేశామని.. అయితే.. కేంద్రం రూ. 6727 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. .ఇంకా రూ. 4631 కోట్లు రావాల్సి ఉందన్నారు. చంద్రబాబు ఎప్పుడు పోలవరం రివ్యూ చేసినా…క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లినా.. అధికారులు పెద్దఎత్తున హడావుడి చేసేవారు.కానీ ఈ సారి మాత్రం..ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు వచ్చినా అధికారులు ఎలాంటి హడావుడి చేయలేదు. కోడ్ ఉందన్న కారణంగా..సీఎస్ ఆంక్షలు పెట్టడం.. సీఎస్ సీఎంకు మధ్య కోల్డ్ వార్ జరుగుతున్న నేపధ్యంలో.. అధికారులు.. ఎందుకైనా మంచిదని దూరంగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది