తెలుగుదేశం పార్టీ నేత వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబునాయుడు పరామర్శించారు. రెక్కీ నిర్వహించిన దానికి సీసీ కెమెరా దృశ్యాలు ఉన్నప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని సమావేశం తర్వాత చంద్రబాబు ప్రశ్నించారు. ప్రజలు నమ్మే విధంగా పోలీసుల విచారణ ఉండాలని.. ,ఘటన విషయం బయటకు వచ్చి ఇప్పటికే వారం అవుతుంది… అయినా ఏమీ తేల్చలేదన్నారు. ఫిర్యాదు రాలేదని పోలీసులు చెబుతున్నారని.. తాను డీజీపీకి లేఖ కూడా రాశానని…దాని ఆధారం గా విచారణ చెయ్యలేరా! అని ప్రశ్నించారు.
తనకు ప్రాణ హాని ఉందని స్వయంగా వంగవీటి రాధా చెప్పారు.ఇంటి వద్ద కారు తిరిగినట్లు ఆదారాలు వచ్చిన తరువాత కూడా ఎందుకు దోషులను పట్టుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. దోషులను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుందని చంద్రబాబు పోలీసులపైఅనుమానం వ్యక్తం చేశారు. వంగవీటి రంగా వర్థంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాధాకృష్ణ తనపై రెక్కీ నిర్వహించిన విషయాన్ని బయట పెట్టారు. ఈ అంశం సంచలనం సృష్టించింది.
తనపై దాడికి రెక్కీ నిర్వహించారంటూ వంగవీటి రాధాకృష్ణ ఆరోపణలు చేసిన తర్వాత ఎక్కువగా తాడేపల్లిలోని ఫామ్‌హౌస్‌లోనే ఉంటున్నారు. తనను పరామర్శించడానికి వచ్చే వారితో అక్కడే సమావేశం అవుతున్నారు. చంద్రబాబు కూడా తాడేపల్లిలోని ఇంటికే వెళ్లారు. వంగవీటి ాధాకృష్ణను రెక్కీ గురించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంగవీటి రాధాకృష్ణ తల్లి కూడా ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పాల్గొన్నారు.