ఏపీని త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. సోమవారం అన్ని జిల్లా కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సదస్సులో పాల్గొన్న చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కలెక్టర్ల సదస్సు సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వైసీపీ హయాంలో జగన్ ప్రజా వేదికలో కలెక్టర్ల సదస్సును ఏర్పాటు చేసి కూలగొట్టారని గుర్తు చేశారు. నిజాయితీగా పని చేసే అధికారులను పక్కనపెట్టారు..ఆఖరికి అధికారులను కూడా బ్లాక్ మెయిల్ చేశారు. ఏపీ ఔన్నత్యాన్ని దెబ్బతినేలా ఐదేళ్లలో జగన్ వ్యవహరించారు..ఒకప్పుడు ఆంధ్రా అధికారులంటే ఢిల్లీలో గౌరవం ఉండేదని.. జగన్ నిర్ణయాల వలన చులకన భావం ఏర్పడే పరిస్థితి తీసుకొచ్చారని వివరించారు. మనం తీసుకునే నిర్ణయాల వలన వ్యవస్థలు మారుతాయి.. భవిష్యత్ బాగు కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు మేలు జరగడమే కాకుండా..రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసినట్లు అవుతుంది. అందరం కలిసికట్టుగా పని చేస్తే మెరుగైన ఫలితాలను సాధిస్తామని..2047 నాటికీ ప్రపంచంలో నెంబర్ వన్ గా ఎదుగుతామని చంద్రబాబు వివరించారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నష్టపోని వారు ఎవరూ లేరు.. జగన్ దుర్మార్గమైన, విధ్వంస పాలనకు వ్యతిరేకంగా ప్రజలు మమ్మల్ని భారీ మెజార్టీతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రాన్ని మళ్లీ గాడిలో పెట్టి అభివృద్ధిలో ఏపీని మరింత ముందుకు తీసుకెళ్ళాల్సిన ఆవశ్యకత ఉంది. వైసీపీ పాలనలో దెబ్బతిన్న ఏపీ బ్రాండ్ ను మళ్లీ పూర్వపు స్థితికి తీసుకురావాలి. గత ఐదేళ్లలో ఒక్కసారైన కలెక్టర్ల సదస్సు పెట్టకపోవడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అని ప్రశ్నించారు. కలెక్టర్ల సదస్సు అనేది ఓ ఆనవాయితీ.. ప్రజలకు పాలనను దగ్గర చేసేందుకు నిర్వహించాల్సిన కార్యక్రమం..ప్రజలకు మంచ్ చేసేందుకు ఈ సదస్సులు దోహదం చేస్తాయన్నారు చంద్రబాబు.
కొన్ని శాఖలు రాష్ట్ర అభివృద్దికి దోహదం చేస్తాయి. అభివృద్ధి ద్వారా సంక్షేమ కార్యక్రమాలు కొనసాగించే అవకాశం ఉంటుంది. అభివృద్ధి చేస్తూనే.. ప్రజలు మెచ్చేలా పాలన అందించాలన్నారు చంద్రబాబు. సమస్యల పరిష్కారంలో మానవీయకోణంలో ఆలోచించాలి..మంచి ఆలోచనతో కలెక్టర్లు పని చేస్తేనే నిర్దేశించుకున్న పనులన్నీ పూర్తి అవుతాయని వివరించారు.
కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు పూర్తి ప్రసంగం కింది లింక్ లో