హీరోయిన్ చార్మీ వివాదంలో పడింది. ప్రస్తుతం పోర్చుగల్లో బాలకృష్ణ హీరోగా పూరిజగన్నాథ్ తెరకెక్కిస్తోన్న ‘పైసా వసూల్’ సినిమా షూటింగ్ జరుగుతోన్న విషయం విదితమే. ఈ షూటింగ్ లో బాగంగా అక్కడికి వెళ్ళింది చార్మీ. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఛార్మి కొన్ని ఫొటోల్ని పోస్ట్ చేసింది. పోర్చుగల్లో ఓ గురుద్వారాని సందర్శించిన ఛార్మి, అక్కడి విశేషాల్ని సోషల్ మీడియాలో అభిమానుల ముందుంచింది. దీనిపై వివాదం మొదలైయింది
అసలు వివాదమేంటంటే, ఛార్మి డ్రెస్సింగ్. ‘గురుద్వారా సందర్శన బాగానే వున్నా.. ఆ డ్రెస్సింగ్ ఏమాత్రం బాగాలేదనే అభిప్రాయలు వ్యక్తమౌతున్నాయి. ఈ విషయంలో ఛార్మిపై విమర్శలు సంధిస్తున్నారునెటిజన్లు. మహిళల వస్త్రధారణ, మహిళలకు దేవాలయాల్లో ప్రవేశంపై అనేక వివాదాలూ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇపుడు చార్మీ డ్రెస్ మీద కూడా ఓ వివాదం వచ్చింది. కథానాయికలు గ్లామర్ గురించి ఆలోచించడం తప్పు లేదు. కానీ… సమయం, సందర్భం ఇవి కూడా పరిగణలోకి తీసుకోవడం మర్చిపోకూడదు. ఈ విషయంపై కథానాయికలు కాస్త ఆలోచించడం మంచిదేమో. లేదంటే ఇలాంటి లేనిపోని వివాదాల్లో ఇరుక్కొనే ప్రమాదం ఉంది.