వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోమనే వైసీపీ సీనియర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా ఈ జాబితాలో చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా చేరారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ తన వెంట ఉండాలని కోరారని అందుకే తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. తన కుమారుడు చెవిరెడ్డి మోహిత్‌కు సీఎం జగన్ టిక్కెట్ ఇస్తారని ఆయనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. అయితే జగన్ రెడ్డి ఎన్నికలకు వెళ్లడానికి చెవిరెడ్డి పక్కన ఎందుకు ఉండాలని జగన్ అనుకుంటున్నారో కానీ.. చంద్రగిరిలో పరిస్థఇతి బాగో లేదని అభ్యర్థిని మార్చాలన డిసైడయ్యే జగన్ ఈ హింట్ ఇచ్చారని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో చెవిరెడ్డి కుమారుడికి కూడా సీటు రాదని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇలా చేతులెత్తిసిన వైసీపీ సీనియర్లలో చెవిరెడ్డి సంఖ్య చాలా ఎక్కువే. భూమన కరుణాకరెర్డిడ. ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ , తమ్మినేని సీతారాం , పేర్ని నాని , బాలినేని ఇలా చాలా మంది తాము పోటీ చేయడం లేదని చెప్పుకొస్తున్నారు. ఇంకా ముందు ముందు ఎంత మంది తమకు పోటీ చేసే ఉద్దేశం లేదని చెబుతారో కానీ.. పరిస్థితి మాత్రం తేడాగా మారుతోందని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
టిక్కెట్ ఇస్తామన్నా కూడా ఈ సారి వైసీపీకి పోటీ చేసే అభ్యర్థులు ఉండరని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు దానికి తగ్గట్లుగానే సీనియర్లు తాము పోటీ చేయబోమంటున్నారు. మరో వైపు జగన్మోహన్ రెడ్డి వారసులకు టిక్కెట్లు ఇవ్వబోమని సీనియర్లే పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. వారసులకు ఇవ్వకపోయినా పర్వాలేదు తాము మాత్రం పోటీ చేసేది లేదంటున్నారు. మొత్తంగా వైసీపీ టిక్కెట్లు మాకువద్దు బాబోయ్ అనే పరిస్థితి ముందే వచ్చేసిందన్న సెటైర్లు పడుతున్నాయి.