చిత్తూరు జిల్లా రాజకీయాల్లో చంద్రగిరి నియోజకవర్గానికి ఓ ప్రత్యేక స్థానముంది. అక్కడ ఎప్పుడూ ఎన్నికల గొడవలు జరిగిన దాఖలాల్లేవు. కానీ ఇప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. వైసీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచిన చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి రాజకీయంగా నిలదొక్కుకునేందుకు గ్రామాల్లో ప్రజల మధ్య చిచ్చు పెట్టేస్తున్నారు. డబ్బుల వెదజల్లడం దగ్గర్నుంచి… వర్గాల మధ్య పోరు పెట్టి … రావమకాష్టం రగిలించడం వరకు చాలా చేస్తున్నారు. ఏడాది కిందట…నుంచే డబ్బుల పంపిణీ ప్రారంభించారు. స్వయం సహాయక బృందాల అకౌంట్లలో నేలకు రూ. 2వేలు జమ చేయడం ప్రారంభించారు. ఆ తర్వతా క్రికెట్ పోటీలను నిర్వహించి, యువతకు క్రికెట్ కిట్లు, నగదు బహుమతులు ఇచ్చారు. వినాయక చవితికి అడిగినా అడగకపోయినా ప్రతి గ్రామానికీ వినాయకుని ప్రతిమల అందించారు. పండుగలప్పుడు పార్టీలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉద్యోగుల ఇళ్ళకు స్వీట్లు, బట్టలు పంచారు.
ఏడాదిగా ఈ పంపకాలు సాగుతూనే ఉన్నాయి. అయితే.. టీడీపీ తరపున గల్ల అరుణకుమారి రాజకీయాల నుంచి వైదొలగడంతో… అక్కడ పులివర్తి నాని అనే నేతకు… ఇన్చార్జ్ పదవి లభించింది. ఆయనే ఇప్పుడు అభ్యర్థి. దాంతో.. చెవిరెడ్డి.. కష్టం అనుకున్నారేమో కానీ.. దూకుడు పెంచేశారు. ప్రభుత్వం పసుపు -కుంకుల కింద చెక్కులు పంపిణీ చేసింది. దాన్ని రసాభాస చేసి జైలుకెళ్లారు. పసుపు కుంకుమల పంపిణీని అడ్డుకోవడం, పోటీగా పసుపుకుంకుమలు, జాకెట్ పీసులు పంపిణీ చేశారు. ఇక గొడవల సంగతి మామూలుగా లేదు. సర్వేలు చేస్తున్నారంటూ టీడీపీ కార్యకర్తలను ఎక్కడ కనిపిస్తే అక్కడ కొడుతున్న వైసీపీ నేతలు. వివిధ ఘటనల్లో చెవిరెడ్డి ఐదు సార్లు అరెస్టయ్యారు. చివరికి టీడీపీ ఇన్‌ఛార్జి నానీ తన హత్యకు ఇద్దరితో రెక్కీ నిర్వహిస్తున్నారంటూ తన దగ్గర పనిచేసే ఇద్దరు వ్యక్తులను పోలీసులకు అప్పగించి కొత్త గేమ్ ఆడారు.
చంద్రగరిలో పంపిణీకి సిద్ధమైన మద్యం, గడియారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే పంపిణీ పూర్తి చేసిన చోట… జగన్ మీడియా ప్రతినిధుల్ని తీసుకెళ్లి… మైకుల ముందు.. వైసీపీకే ఓటు వేయిస్తామని చెప్పిస్తున్నారు. ఇలాంటి వాళ్లంతా టీడీపీ ఓటర్లే. తాజాగా పనపాకం అనే గ్రామంలో చిచ్చు రేపారు. తాయిలాలు తీసుకున్న వారి వైసీపీకే ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేయించాడనికి ప్రయత్నించడంతో పార్టీల కార్యకర్తల మధ్య వివాదం పెద్దదయింది. గ్రామస్థులు భారీగా గుమికూడి పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది.