2014లో తాను సీఎం అయ్యే నాటికి రూ. 200 ఉన్న వృద్ధాప్య పెన్షన్ ను అధికారంలోకి రాగానే రూ. వెయ్యి చేశారు. మళ్లీ ఎన్నికలకు ఆరు నెలల ముందు రూ. రెండు వేలు చేశారు. ఈ వృద్ధుల ఓటు బ్యాంక్ ఎంత పర్ ఫెక్ట్ గా ఉంటుందో తెలుసు కాబట్టి జగన్. వాళ్లని మాయ చేశారు. తాను రాగానే మూడు వేలు ఇస్తామన్నారు. కానీ ఆయన తర్వాత దాన్ని రూ. 250 చొప్పున పెంచారు. ఆ విషయం పక్కన పెడితే వృద్ధాప్య పెన్షన్లు తీసుకునే ఓటర్లకు ఈ సారి పూర్తిగా నిరాశ పరిచారు. తాను రూ. 3వేలకు మించి పెన్షన్ ఇవ్వలేనని ప్రకటించారు. మళ్లీ వచ్చే ఎన్నికలకు ముందే పెంచుతానని చెప్పుకొచ్చారు.
జగన్ ప్రకటన చూసి టీడీపీ ఆశ్చర్యపోయింది. వెంటనే తమ నాలుగు వేల పెన్షన్ హామీని ప్రజల్లోకి తీసుకెళ్లింది. వృద్ధుల్లో ఈ అంశం చర్చనీయాంశమవుతోంది. రెండు వందల నుంచి ఐదేళ్లలోనే రెండు వేలకు పెంచిన చంద్రబాబునాయుడు.. నాలుగు వేల పెన్షన్ ఇస్తారంటే… ఇక వారికి కావాల్సిందేముంటుంది ?. వృద్దాప్య, సామాజిక పెన్షన్ల లబ్దిదారుల్లో కులమతాలు ఉండవు. వారికి ఎవరు ఎక్కువ లబ్ది చేకూరిస్తే వారికే ఓటు వేస్తారు. వాలంటీర్ల బెదిరింపులు అక్కడ పని చేసే అవకాశం ఉండదు.
వృద్ధాప్య పెన్షన్ రూ. నాలుగు వేలు చేస్తారని వైసీపీ క్యాడర్ కూడా అనుకుంది. కానీ అలాంటి నిర్ణయం చేయకపోవడంతో జగన్మోహన్ రెడ్డిని సలహాదారుు ముంచేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సలహాదారులు చెప్పడం వల్లనే జగన్ నిర్ణయం తీసుకోలేదని మిగతా హామీల కన్నా.. ఇది చాలా పెద్ద మైనస్ అవుతుందని కంగారు పడుతున్నారు.