చంద్రబాబు అంటే వ్యతిరేకత చూపే ఆధ్యాత్మిక వేతల్లో ముందు వరుసలో ఉంటారు చినజీయర్ స్వామి. చంద్రబాబు స్వామిజీలకు తక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఎప్పుడో చంద్రబాబు మొదటి సారి సీఎంగా ఉన్నప్పుడు తిరుమల విషయంలో జరిగిన ఓ విషయంలో చంద్రబాబుపై చినజీయర్ వ్యతిరేకత పెంచుకున్నారు. అప్పట్నుంచి ఆయన సానుకూలంగా మాట్లాడింది లేదు. చంద్రబాబు ప్రత్యర్థుల్ని ఆదరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు శ్రమను చూసి ఆయన పొగడకుండా ఉండలేకపోతున్నారు.
విజయవాడ వరద బాధితుల కోసం చంద్రబాబు పడుతున్న శ్రమ చూసి.. ఆయన అభినందించకుండా ఉండలేకపోయారు. గత నాలుగైదు రోజులుగా వరద బాధితుల కోసం చంద్రబాబు చేపడుతున్న సహాయ చర్యలు.. అర్థరాత్రి వేళ కూడా ముంపు ప్రాంతాల్లో కూడా పర్యటించడం.. ఆయన ఓపిక ఆశ్చర్యం కలిగించిందని అన్నారు. యువకుల కంటే ఉత్సాహంగా పని చేస్తున్నారని.. సమయాన్ని వృధా చేయకుండా.. ఆపన్నులకు సాయం చేయడం సంతోషమని చెప్పుకొచ్చారు.
హుదూద్ సమయంలోనూ ఆయన ఎలా పని చేశారో ఇప్పుడూ అలాగే చేస్తున్నారని.. చంద్రబాబు మరింత ఆరోగ్యంగా ఉండాలని, ఇలాంటి కార్యక్రమాలు చేయగలిగే శక్తి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు. చంద్రబాబు ఫీల్డ్ లో ఉండి పని చేయడం వల్ల అధికారగణం మొత్తం శ్రమిస్తున్నారు. 74 ఏళ్ల వయసులో చంద్రబాబు చేస్తున్న శ్రమ చూసి..