ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న సినిమా రేట్ల తగ్గింపు నిర్ణయం పరిశ్రమకు ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. ఇరవై ఏళ్ల క్రితం నాటి ధరలతో ఇప్పుడు సినిమాలు ప్రదర్శించలేమని వాపోతున్నారు. చాలా థియేటర్లు ఇప్పటికే మూతపడ్డాయి. సంక్రాంతికి కొత్త, భారీ సినిమాలు విడుదలౌతున్న తరుణంలో ఇలాంటి పరిణామం సినీ పరిశ్రమని కుదిపేస్తుంది. అయితే ఈ సమయంలో తెలంగాణ ప్రభుత్వం చిత్ర పరిశ్రమకి తీపి కబురు అందించింది. ధరలు పెంచే అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విషయంలో పరిశ్రమ తరపునుంచి మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకొని తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో చర్చలు జరిపారని తెలిసింది. చిరు, ఎంపీ జోగినపల్లి సంతోష్ కలసి .. కేసీఆర్ వద్దకు వెళ్ళడం చర్చలు జరపడం,, ఆ చర్చలు సఫలం కావడం జరిగింది.
తెలంగాణలో జరిగినట్లే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలతో కూడా చిరంజీవి భేటి అవుతారని తెలిసింది. మంత్రి పెర్ని నానితో కలసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో చిరు భేటి జరుగుతుందని సమాచారం. ఈ మేరకు అపాయింట్మెంట్ కూడా కుదిరిందని తెలిసింది. మరో రెండు రోజుల్లో భేటి వుంటుందని భోగట్టా. తెలంగాణ ప్రభుత్వం సనూకూలంగా స్పందించినట్లే ఏపీ ప్రభుత్వం కూడా పరిశ్రమ కష్టాన్ని అర్ధం చేసుకొని నిర్ణయం తీసుకుంటుదని చిరు ఆశ భావంలో వున్నారని తెలిసింది. ఈ రెండు రోజుల్లో టికెట్ల సమస్య ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే వుంది.