చిరంజీవి కెరీర్ లో మైలు రాయిగా నిలిచిన చిత్రం ‘ఖైదీ’. ఆయన గురించి చెప్పాలంటే ‘ఖైదీ’ కి ముందు.. తర్వాత అని ప్రస్తావించాల్సిందే. 1983లో వచ్చిన ఈ సినిమా సృష్టించిన సంచలనం సృష్టించింది. చిరంజీవికి మాస్ ఇమేజ్, స్టార్‌డమ్‌ని తెచ్చిపెట్టింది. తనదైన శైలి డ్యాన్స్, డైలాగ్స్‌తో అలరించారు. ఆ సినిమా తర్వాత ఆయన ప్రయాణమే పూర్తిగా మారిపోయింది. చిరంజీవి కి లార్జ్ దెన్ లైఫ్ ఇమేజ్ ని తీసుకొచ్చిన సినిమా అది. ఇప్పుడీ సినిమా నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంది.
ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నారు చిరంజీవి. ‘ఖైదీ’ చిత్రం నిజంగానే అభిమానుల గుండెల్లో నన్ను శాశ్వత ‘ఖైదీ’ని చేసింది. నా జీవితంలో ఓ గొప్ప టర్నింగ్ పాయింట్ ఆ చిత్రం ! ఆ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించిన తీరు ఎప్పటికీ మరువలేనిది. ఖైదీ విడుదలై నేటికి 40 సంవత్సరాలయిన సందర్భంగా ఒక సారి ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, ఆ చిత్ర దర్శకులు ఎ.కోదండరామిరెడ్డి గారిని, నిర్మాతలు సంయుక్తా మూవీస్ టీమ్ ని, రచయితలు పరుచూరి సోదరులను, నా కో- స్టార్స్ సుమలత , మాధవి లని మొత్తం టీమ్ ని అభినందిస్తూ, అంత గొప్ప విజయాన్ని మా కందించిన తెలుగు ప్రేక్షకులందరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు” తెలిపారు చిరంజీవి.
ప్రస్తుతం చిరంజీవి వశిష్ట దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది.