మార్గదర్శిపై ప్రభుత్వ కుట్రలు బహిరంగంగానే కనిపిస్తున్నాయి. ఆ సంస్థపై దాడులు చేశారు. వెయ్యి కోట్ల ఆస్తులు జప్తు చేశారు. అయినా ఏ నేరం చేశారో మాత్రం కోర్టుకు ఇంత వరకూ చెప్పడం లేదు. ఫలానా నేరం చేశారని… చెప్పి కోర్టులో చెప్పాల్సిన మాటలన్నీ… ఊరూవాడి తిరుగుతూ మీడియాకు చెబుతున్నారు సీఐడీ చీఫ్. తాజాగా హైదరాబాద్ లో మరో ప్రెస్ మీట్ పెట్టారు. గతంలో చెప్పిన ఆవుకథనే చెప్పారు.
మార్గదర్శి డిపాజిట్లు తీసుకుందని ఓ సారి చెబుతారు.. తీసుకోలేదని మరోసారి చెబుతారు. మార్గదర్శికి డిపాజిట్లు తీసుకునే పర్మిషన్ లేదు. నిజంగా అలాంటి డిపాజిట్లు తీసుకుని దారి మళ్లించి ఉంటే.. కోర్టు ముందు పెట్టడం లేదా.. నియంత్రణ సంస్థలకు ఫిర్యాదు చేయడం క్షణాల్లో పని. ఆ పని చేయడం లేదు. ఎన్ని సార్లు సోదాలు చేయాలో అన్ని సార్లు చేశారు. అయినా మీడియా ముందే మాట్లాడున్నారు.
కంపెనీ ఆర్థిక కష్టాల్లో ఉందని.. చిట్స్ వేసిన వాళ్లంతా ఎవరి డబ్బులు వారు తీసుకోవాలన్నట్లుగా.. సీఐడీ చీఫ్ మార్గదర్శి వ్యాపారం చేస్తున్నరాష్ట్రాల్లో ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నారు. ఇది అడ్డగోలుగా ఓ పోలీసు అధికారి చేస్తున్న కుట్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అసలు దర్యాప్తు అధికారి కోర్టుకు చెప్పాలి.. కానీ.. ఒకే ఆరోపణను పదే పదే చెబుతూ.. కంపెనీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు.
నిజానికి వాళ్లు చేసే ప్రచారం చిట్ ఫండ్ కంపెనీల మీద ప్రభావం చూపదు. ఆ విషయం నిపుణులు చెప్పినా.. కక్షతో కళ్లు మూసుకుపోయినవారికి అర్థం కాదేమోనని అనుకోవాలి. డిపాజిట్లు తీసుకుని ఉంటే.. ఎవరైనా డిపాజిటర్లు తమ డబ్బులు తమకు ఇవ్వమని వెనక్కి వస్తారు. చిట్స్ లో అలాంటిదేమీ ఉండదు. ఇరవై మందితో గ్రూప్ ఉంటే.. ప్రతి నెలా అందరూ చెల్లించినవి ఒకరికి ఇస్తారు. ఇక్కడ డిపాజిట్లనే ప్రస్తావన రాదు. వెనక్కి ఇవ్వమని కూడా రారు. పది నెలలు చిట్ కట్టిన వాళ్లు.. సరైన ష్యూరిటీలు ఇవ్వలేకపోవడమో మరో కారణంగాపది నెలల చిట్ మొత్తాన్ని ఉంచుకుని మిగతా ఇవ్వమని అడుగుతారు. అది డిపాజిట్ కిందకు రాదు. పది నెలల చిట్ మొత్తం అవుతుంది. దాన్ని వెనక్కి అడగలేరు. అలా అడిగితే ష్యూరిటీలు సమర్పించారు.
కానీ సీఐడీ చీఫ్ సంజయ్కు.. ఏదో విధంగా మార్గదర్సిపై తప్పుడు ప్రచారం చేయాల్సిందేనని.. ఆ సంస్థను ఇబ్బంది పెట్టాల్సిందేనని టాస్క్ ఇచ్చినట్లుగా ఉన్నారు. ఆయన మత్రం పట్టువదలకుండా.. తప్పుడు ప్రచారం చేస్తూనే ఉన్నారు. తాను చేస్తున్నది ఎంత నేరమో.. పోలీసు అధికారి అయిన ఆయనకు తెలియకుండా ఉండదని.. తోటి పోలీసు అధికారులే సెటైర్లు వేస్తున్నారు.