పొరపాటున లుకౌట్ నోటీసులు జారీ చేశాం… సీఆర్పీసీ నోటీసులు కాయితాల మధ్యలో వెళ్లిపోయాయి… . నోటీసులు జారీ చేసినందుకు క్షమాపణ చెబుతాం… వాదనలు వినిపించడానికి వాయిదాలు కావాలి… ఇది కోర్టుల్లో సీఐడీ తీరు. ఇంత పనికి మాలిన సీఐడీ… అడ్డగోలు వ్యవహారాలతో అడ్డంగా దొరికిపోతోంది.
కొద్ది రోజుల కిందట బండారు సత్యనారాయణను అరెస్టు చేయాడానికి పోలీసులు వెళ్లారు. రోజూపై అసభ్య వ్యాఖ్యలు చేశారని కేసు. ఇరవై నాలుగు గంటల పాటు ఆయనను ఇంట్లో నిర్బంధించి.. తర్వాత 41ఏ నోటీసులు జారీ చేశారు. కానీ వెంటనే అరెస్టు చేశారు. హైకోర్టు లో ఆయన పిటిషన్ వేస్తే… న్యాయమూర్తి కూడా ఆశ్చర్యపోయారు. ఇదేం పోలీసింగ్ అంటే.. నోటీసు పొరపాటున పేపర్ల మధ్యలో బండారు దగ్గరకు వెళ్లిపోయిందట. ఈ వాదన విని….కోర్టు హాల్లో ఉన్న వారందరికీ మూర్చవచ్చినంత పనైంది .
కొద్ది రోజుల కిందట… మార్గదర్శి విషయంలో హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా సరే… శైలజా కిరణ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇదేందని హైకోర్టు అడిగితే.. పొరపాటున వెళ్లాయని.. చెప్పారు. సీఐడీ వాదన విని.. హైకోర్టు ఆశ్చర్యపోయింది. కోర్టుల్లో ఇలా కూడా వాదిస్తారా అని . ఆ కేసు విచారణ ఇంకా సాగుతోంది. తాజాగా సీఐడీ కిలారు రాజేష్ విషయంలోనూ అదే చేసింది. పొరపాటున లుకౌట్ నోటీసులు జారీ చేశామని అంటోంది.
తప్పుడు కేసులు పెట్టడమే లక్ష్యంగా సీఐడీ చెలరేగిపోతోంది. ఎక్కడిక్కడ దొరికిపోతోంది. కానీ వ్యవస్థల్లో ఉన్న లోపాలను అడ్డంపెట్టుకుని తాత్కలికంగా బయటపడుతోంది. ఇవాళో రేపో పూర్తి స్థాయిలో సీఐడీ దొరికిపోవడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. న్యాయవ్యవస్థను సైతం దుర్వినియోగం చేస్తున్న వ్యవహారం సంచలనం అవుతోంది.